తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || International iran February 28, 2026

అగ్రనేత ఖమేనీ మరణం: ఇరాన్ అధికారికంగా ధృవీకరించబడింది

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 

 అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో సుప్రీం లీడర్ హతం టెహ్రాన్‌లో ధ్వంసమైన నివాసం… దేశంలో శోకసంద్రం

టెహ్రాన్/వాషింగ్టన్: గడిచిన కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది. ఇరాన్ అత్యున్నత ఆధ్యాత్మిక నేత (సుప్రీం లీడర్) అయతొల్లా అలీ ఖమేనీ (86) మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ఆదివారం ఉదయం ధృవీకరించింది. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు సంయుక్తంగా చేపట్టిన **‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’**లో భాగంగా టెహ్రాన్‌లో ఖమేనీ నివాసాన్ని లక్ష్యంగా చేసిన గగనతల దాడుల్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్ స్టేట్ టీవీ “మేము అల్లాహ్ కే చెందుతాము, ఆయన వద్దకే తిరిగి వెళ్తాము” అనే ఖురాన్ వాక్యంతో ఈ వార్తను ప్రకటించింది. ఖమేనీ మరణం ఇరాన్ విప్లవానికి దిక్సూచిగా ఉండటంతో, దేశవ్యాప్తంగా సంతాప దినాలను ప్రకటించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

అంతకుముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఖమేనీ హతమైనట్టు ప్రకటించగా, ఇరాన్ మీడియా ధృవీకరించడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది.

కుప్పకూలిన భవనం, చెల్లాచెదురైన నాయకత్వం శనివారం తెల్లవారుజామున జరిగిన దాడిలో ఖమేనీ నివాస భవనం పూర్తిగా ధ్వంసమైంది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, ఆ ప్రాంతం మొత్తం శిథిలాలయంలా మారింది. ఖమేనీతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కీలక కమాండర్లు, రక్షణ మంత్రి కూడా దాడిలో మరణించారు.

1989 నుంచి ఇరాన్ పగ్గాలు చేపట్టిన ఖమేనీ యుగం ముగియడంతో, తదుపరి వారసుడు ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.