దేశాన్ని కుదిపేసే ఉగ్ర యత్నాన్ని భగ్నం చేసిన ఎన్‌ఐఏ దేశవ్యాప్తంగా సంచలనానికి గురిచేస్తూ, 32 కార్లలో బాంబులు అమర్చి, ఒకేసారి ఎనిమిది ప్రాంతాల్లో ఆత్మాహుతి దాడులకు సిద్ధమైన ఫరీదాబాద్ ఉగ్ర ముఠా భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బయటపెట్టింది. ఇందులో పాల్గొన్న సభ్యులందరూ వైద్యులే కావడం మరింత కలవరపాటుకు గురిచేస్తోంది. అసాధారణ విధ్వంసానికి పన్నిన పథకం ఎన్‌ఐఏ దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం — మొత్తం 32 కార్లను పేల్చే ప్రణాళిక వాటిని నాలుగు గ్రూపులుగా విభజించిన 8 మానవ బాంబులు అమలు చేయాల్సిన బాధ్యత ప్రధాన లక్ష్యం ఢిల్లీ–ఉత్తరప్రదేశ్ దీనికే వేదికగా హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ యూనివర్సిటీ హాస్టల్‌లోని 17వ భవనంలోని 13వ గది ఈ ముఠాకు ప్రధాన స్థావరంగా మారినట్లు గుర్తించారు. టర్కీ నుంచి ఆదేశాలు – ‘ఉకాసా’ అనే హ్యాండ్లర్ దాడుల వెనుక ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై పరిశోధనలో కీలకమైన విషయం తెలిసింది. టర్కీలో ఉన్న ‘ఉకాసా’ అనే అనుమానాస్పద వ్యక్తి ఈ మాడ్యూల్‌కి నిరంతరం ఆదేశాలు ఇచ్చినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కమ్యూనికేషన్ కోసం స్విట్జర్లాండ్‌కు చెందిన త్రీమా (Threema) య...
Local to international