Skip to main content

Posts

Showing posts with the label Telangana

⚖️ జగన్ అక్రమాస్తుల కేసు: ఐఏఎస్ శ్రీలక్ష్మి క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో సీబీఐ వాదన

  హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా ఉన్న పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై నమోదైన కేసును ఈ దశలో కొట్టివేయవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) హైకోర్టును కోరింది. ఆమె దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అనుమతించరాదని సీబీఐ గట్టిగా వాదించింది. విచారణలోనే నేరం రుజువవుతుంది: సీబీఐ గురువారం నాడు జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ ధర్మాసనం ఎదుట శ్రీలక్ష్మి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ జరిగింది. సీబీఐ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ కాపాటి వాదనలు వినిపిస్తూ, శ్రీలక్ష్మి నేరం చేశారా లేదా అనే అంశం కేవలం సీబీఐ కోర్టులో జరిగే విచారణ (Trial) ద్వారా మాత్రమే నిర్ధారితమవుతుందని స్పష్టం చేశారు. అందువల్ల, ఈ ప్రారంభ దశలో కేసును కొట్టివేయడం న్యాయం కాదని కోర్టుకు విన్నవించారు. ముఖ్య వాదనలు:  * డీవోపీటీ అనుమతి: శ్రీలక్ష్మిని ప్రాసిక్యూట్ చేయడానికి కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (DOPT) ఇప్పటికే అనుమతి మంజూరు చేసిందని సీబీఐ న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు.  * ఎప్పుడు ...

చిరంజీవి ట్రస్ట్‌కు FCRA అనుమతి: విదేశీ విరాళాల సేకరణకు మార్గం సుగమం:మగధీరుడు సేవా సమితి.మాలపాటి శ్రీనివాసులు:అధ్యక్షులు

  హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు మరియు మెగాస్టార్ చిరంజీవి  స్థాపించిన 'చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతిని మంజూరు చేసింది. ట్రస్ట్ ఇకపై విదేశీ విరాళాలు (Foreign Contributions) సేకరించేందుకు వీలుగా 'విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA - Foreign Contribution Regulation Act)' అనుమతిని కేంద్ర హోం శాఖ మంజూరు చేసింది. 💰 విదేశీ నిధుల సేకరణకు అవకాశం ఈ FCRA లైసెన్స్ లభించడం వల్ల, ట్రస్ట్ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయడానికి అంతర్జాతీయ సంస్థలు, విదేశాలలో ఉన్న దాతలు మరియు ఎన్నారై (NRI)ల నుండి విరాళాలను చట్టబద్ధంగా స్వీకరించడానికి అవకాశం ఏర్పడింది. ట్రస్ట్ యొక్క సేవా కార్యక్రమాలకు ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా పరిగణించబడుతోంది. 🩸 ట్రస్ట్ సేవా కార్యక్రమాల నేపథ్యం చిరంజీవి ట్రస్ట్ సుదీర్ఘ కాలంగా ముఖ్యంగా ఆరోగ్య రంగంలో విశేష సేవలు అందిస్తోంది.  * బ్లడ్ బ్యాంక్: ఈ ట్రస్ట్ దేశంలోనే అతిపెద్ద రక్త నిధి (Blood Bank) కార్యకలాపాలను నిర్వహిస్తోంది, వేలాది మందికి అత్యవసర సమయాల్లో రక్తాన్ని అందిస్తోంది.  * ఐ బ్యాంక్ (కంటి బ్యాంక్): దృష్టి లోపం ఉన్నవారికి సహాయ...

ఆన్‌లైన్ బెట్టింగ్‌ మాయ.. ఖాకీ బతుకు చిన్నాభిన్నం: రూ. కోటిన్నర స్వాహా, సర్వీస్ రివాల్వర్ కూడా కుదువపెట్టిన అంబర్‌పేట్ ఎస్ఐ

  హైదరాబాద్  సమాజంలో నేరాలను అరికట్టి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ బాధ్యతాయుతమైన పోలీస్ అధికారి, ఆన్‌లైన్ బెట్టింగ్‌ల ఊబిలో కూరుకుపోయి నేరస్తుడిగా మారిన ఘటన పోలీసు శాఖలో కలకలం రేపింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వ్యసనంతో దాదాపు రూ. కోటిన్నర వరకు పోగొట్టుకోవడమే కాకుండా, విధి నిర్వహణలో ప్రభుత్వం అందజేసిన సర్వీస్ రివాల్వర్‌ను, దొంగతనం కేసులో రికవరీ చేసిన బంగారాన్ని సైతం కుదువపెట్టిన అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నేపథ్యం మరియు వ్యసనం: ఆంధ్రప్రదేశంలోని అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన భాను ప్రకాష్, హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు. పోలీస్ వర్గాల సమాచారం మేరకు, భాను ప్రకాష్ 2018 నుండే ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డారు. క్రికెట్ బెట్టింగ్‌లు, ఇతర ఆన్‌లైన్ గేమింగ్ యాప్‌ల మోజులో పడి తన సంపాదనతో పాటు, అప్పులు చేసి మరీ దాదాపు రూ. కోటిన్నర వరకు పోగొట్టుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బయటపడిందిలా.. (ఏఈ ఉద్యోగం నాటకం): బెట్టింగ్‌ల వల్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిన భాను ప్రకాష్, తప్పించుకోవడానికి ...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సీనియర్ ఆర్టీసీ డ్రైవర్ పై దాడి...

 తండ్రి లాంటి వాడిని బిడ్డ కొట్టవద్దు అంటూ ప్రాధేయపడ్డ ఆర్టిసి డ్రైవర్..ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో సిరిసిల్ల ఆర్టీసీ డ్రైవర్ ను చితకబాదిన కారు డ్రైవర్.. ఒకే రహదారి కావడంతో ఆర్టీసీ బస్ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదని కోపంతో బస్ కు ఎదురుగా కారు ఆపి బస్ లోకి ప్రవేశించి డ్రైవర్ను చితకబాదిన వైనo..తండ్రి లాంటి వాడిని నన్ను కొడుతవ అని ప్రాధేయపడ్డ ఆర్టీసీ డ్రైవర్..పోలీసులను ఆశ్రయించిన ఆర్టీసీ డ్రైవర్.

వనపర్తిలో టిజిఎస్‌పిడిసిఎల్ AE నర్వ హర్షవర్ధన్ రెడ్డి లంచం తీసుకుంటూ అరెస్ట్.

ఫిర్యాదుదారుని బంధువుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్) మంజూరుకు రూ.40,000 లంచం డిమాండ్. అందులో భాగంగా రూ.20,000 స్వీకరిస్తూ అరెస్ట్ టిజిఎస్‌పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్ పరిధిలోని గోపాల్‌పేట సెక్షన్ సహాయక ఇంజనీరు (ఆపరేషన్స్) నర్వ హర్షవర్ధన్ రెడ్డి లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని బంధువుకు చెందిన వ్యవసాయ భూములకు డిటిఆర్ మంజూరు చేయడానికి మొత్తం రూ.40,000/- లంచం కోరగా, అందులో అడ్వాన్స్‌గా రూ.20,000/- స్వీకరిస్తున్న సమయంలో అధికారులు రంగహాజరై నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
       తెలంగాణ ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవ్ An-124 “రుస్లాన్” ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్లో నిర్మించిన ఈ భారీ విమానం చూపరుల దృష్టిని ఆకర్షించింది. 150 టన్నుల వరకు సరుకును మోసుకెళ్లగలదు. 36 మీటర్ల పొడవైన కార్గో బే ఉంటుంది. దీని ద్వారా భారీ యంత్రాలు, వాహనాలు, విమాన భాగాలను కూడా రవాణా చేయడానికి వీలవుతుంది.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుభాకాంక్షలు – మైనార్టీ సంక్షేమ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్

హైదరాబాద్‌: రాష్ట్ర సచివాలయంలో మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ అజారుద్దీన్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్‌ను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ, అజారుద్దీన్ మైనార్టీ సంక్షేమ రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ కన్నుమూత

  తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయ హే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ (64) ఈరోజు ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాదులో చికిత్స పొందుతున్నారు.సిద్దిపేట జిల్లా రేబర్తి గ్రామానికి చెందిన అందెశ్రీ గారు తెలంగాణ ఉద్యమంలో తన రచనలతో ప్రజల్లో చైతన్యం నింపారు. “జయ జయ హే తెలంగాణ” గీతం రాష్ట్ర ఆవిర్భావ సమయంలో ప్రజల్లో గర్వభావం నింపింది.ఆయన మరణం సాహిత్య, సాంస్కృతిక వర్గాల్లో తీవ్ర విషాదాన్ని కలిగించింది. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు._

హైదరాబాద్ లో .. ఏయే సాఫ్ట్ వేర్ కంపెనీలు ఎప్పుడెప్పుడు

  1979 లో TCS  1982 లోCMC (ఇప్పుడు TCS లో మెర్జ్ అయింది ) 1986 లో అమెరికా హెడ్ ఆఫీస్ గ ఉన్న Intergraph   1987 లో "మహీంద్రా బ్రిటిష్ టెలికాం సర్వీసెస్"  పేరుతో టెక్ మహీంద్రా సోర్స్ -చల్లా శ్రీధర్ మరి IT నేనే తెచ్చాను అని  1995 లో సీఎం అయిన బాబు డప్పు ఏంటో మాదాపూర్‌లో సైబర్‌ టవర్స్‌..  6 ఎకరాల స్థలంలో చిన్న ప్రాజెక్టు.  దానిపేరు హైటెక్‌ సిటీ.  నిజానికి ప్రభుత్వ ఆధ్వర్యంలో అక్కడ ఐటీ స్పేస్‌ కట్టడానికి అప్పటి సీఎం  ఎన్‌.జనార్థన్‌రెడ్డి (21 మే 1992 )పునాది వేశారు.  చంద్రబాబు దాన్ని ఎప్పుడూ చెప్పరు.  1995 లో చంద్రబాబు సీఎం అయ్యాక  రద్దు చేసి ప్రైవేటుకు ఇచ్చేశారు.  ఐటీ, అనుబంధ ఎగుమతులు: చంద్రబాబు దిగిపోయే నాటికి  2003–04లో -రూ.5,660 కోట్లు  వైఎస్సార్‌ హయాము  2008 -09 లో - రూ.32,509 కోట్లు  నిజానికి హైదరాబాద్  వేగంగా అభివృద్ధి చెందింది YS హయములోనే  అని 2015 లో JNTU శాస్త్రవేత్తలు రిపోర్ట్ ఇచ్చారు.

సంక్రాంతి నుంచి శ్రీశైలానికి హెలికాప్టర్ సేవలు!

  హెలీ టూరిజానికి తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్ - శ్రీశైలం వెళ్లేందుకు హెలికాప్టర్ సేవలను వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. నల్లమల అడవి మీదుగా గంట పాటు ఈ ప్రయాణం సాగనుంది. ఇది సక్సెస్ అయితే ఉమ్మడి వరంగల్ లోని రామప్ప, లక్నవరానికీ విస్తరించాలని యోచిస్తోంది. ఈ సేవల కోసం బుకింగ్ యాప్ లేదా వెబ్సైట్ తీసుకురానుంది...!!

మరచిపోలేని మహానటుడు నూతన్ ప్రసాద్: సినీ ప్రస్థానం, ప్రత్యేకత

  హైదరాబాద్: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో హాస్యం, ప్రతినాయక పాత్రలకు తనదైన శైలిని జోడించి, 'నూటొక్క జిల్లాల అందగాడు'గా ప్రసిద్ధి చెందిన మహానటుడు నూతన్ ప్రసాద్ (తడినాధ వరప్రసాద్) జీవిత ప్రస్థానం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ మరపురానిది. 1945, డిసెంబర్ 12న కృష్ణా జిల్లా కైకలూరులో జన్మించిన ఆయన, 2011, మార్చి 30న అనారోగ్యంతో కన్నుమూశారు. రంగస్థలం నుంచి సినీ ప్రవేశం కైకలూరులో జన్మించిన నూతన్ ప్రసాద్, బందరులో ఐటీఐ పూర్తి చేసి నాగార్జునసాగర్, హైదరాబాదులలో ఉద్యోగాలు చేశారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)లో పనిచేస్తున్న సమయంలో రంగస్థల నటుడు భాను ప్రకాష్‌తో ఏర్పడిన పరిచయం ఆయన నట జీవితానికి తొలి మెట్టు. భాను ప్రకాష్ స్థాపించిన 'కళారాధన' సంస్థ ద్వారా 'వలయం', 'గాలివాన', 'కెరటాలు' వంటి నాటకాలలో నటించి రంగస్థలంపై పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా, ఎ.ఆర్.కృష్ణ దర్శకత్వంలో 'మాలపల్లి' నాటకాన్ని 101 సార్లు ప్రదర్శించడం ఆయన నటన పట్ల అంకితభావాన్ని చాటింది. తొలి గుర్తింపు 'ముత్యాల ముగ్గు'తో రంగస్థల అనుభవంతో 1973లో తన ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రసాద్,...

నాట్కో అధినేత వి.సి. నన్నపనేని: సంకల్పంతో విజయం... 'బెస్ట్ బ్యాట్స్‌మెన్‌' కంటే గొప్ప ఫార్మా హీరో!

  హైదరాబాద్/గుంటూరు: సాధారణ రైతు కుటుంబం నుండి వచ్చి, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మా దిగ్గజంగా ఎదిగిన వి.సి. నన్నపనేని (నన్నపనేని వెంకయ్య చౌదరి) జీవిత ప్రయాణం నేటి యువ పారిశ్రామికవేత్తలకు, శాస్త్రవేత్తలకు ఒక గొప్ప స్ఫూర్తి. ప్రపంచ సంపన్నుల జాబితాలో (హురున్ గ్లోబల్ సంపన్నుల జాబితా ప్రకారం $1.2 బిలియన్ సంపదతో 2686వ స్థానం) నిలిచిన ఈయన, కేవలం వ్యాపారవేత్తగానే కాకుండా, తన పరిశోధనల ద్వారా దేశంలో క్యాన్సర్ మందుల తయారీలో విప్లవాన్ని తెచ్చిన ఫార్మా హీరోగా సుపరిచితులు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న నాట్కో ఫార్మా (NATCO Pharma) అధినేతగా ఆయన చేసిన కృషి, సమాజ సేవ అపారమైనది. జీవిత ప్రస్థానం: గోళ్ళమూడిపాడు నుండి గ్లోబల్ శిఖరాలకు గుంటూరు జిల్లా, పొన్నూరు మండలం లోని గోళ్ళమూడిపాడులో జన్మించిన వెంకయ్య చౌదరి, తన బాల్య విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేశారు. కావూరులో ఎస్.ఎస్.ఎల్.సి., గుంటూరులోని ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో బి.ఫార్మా, ఎం.ఫార్మా పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం 1969లో అమెరికా వెళ్లారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ కాలేజీలో ఎం.ఎస్. చదువుతూనే, వ...

వరంగల్ సీపీ ఎదుట మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శి లొంగుబాటు.

వరంగల్‌ : నిషేధిత సి.పి.ఐ (మావోయిస్టు) పార్టీ సౌత్ బస్తర్‌ డివిజనల్ కమిటీ కార్యదర్శి మంద రూబెన్‌ అలియాస్‌ కన్నన్న @మంగన్న @సురేష్‌ (67) మంగళవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ సన్‌ప్రీత్‌ సింగ్‌ ఎదుట లొంగిపోయాడు. రూబెన్‌ హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపాడు గ్రామానికి చెందినవాడు. 1979లో కాజీపేట ఆర్‌.ఈ‌.సి.లో పనిచేస్తున్న సమయంలో మావోయిస్టు మాజీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ప్రభావంతో ఉద్యమంలో చేరాడు. 1981 నుంచి 1986 వరకు బస్టర్‌ ప్రాంతంలో నేషనల్‌ పార్క్‌ దళ కమాండర్‌ లంక పాపిరెడ్డి నేతృత్వంలో దళ సభ్యుడిగా పనిచేశాడు. అనంతరం ఏరియా కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టాడు. 1991లో చత్తీస్గఢ్‌ పోలీసులు అరెస్ట్‌ చేయగా, ఏడాది తర్వాత జైలును తప్పించుకొని మళ్లీ పార్టీలో చేరాడు. 1999లో పార్టీ నాయకుడు రామన్న సాక్షిగా బీజాపూర్‌ జిల్లాకు చెందిన పొడియం భీమేతో వివాహం జరిగింది. 2005 వరకు చురుకుగా పనిచేసిన రూబెన్‌ తర్వాత అనారోగ్యం కారణంగా కార్యకలాపాలనుంచి దూరమై గ్రామంలో కోళ్లు, గొర్రెలు పెంచుతూ జీవించాడు. అయితే, అదే సమయంలో పార్టీ దళాలకు ఆహారం, వసతి, సమాచారం అందించే బాధ్యతలు తీసుకున్నాడు. తన వయస్సు, అనారోగ్యం, ...

హైదరాబాద్‌లో రికార్డు స్థాయి భూవిలువలు – రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో

  హైదరాబాద్‌: నగర రియల్ ఎస్టేట్ రంగంలో మరోసారి చరిత్ర సృష్టించబడింది. టీజీఐఐసీ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) నిర్వహించిన భూముల వేలంలో రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ భూమి రికార్డు స్థాయి ధర పలికింది. ఈ వేలంలో ఎకరా భూమి ధర ఏకంగా రూ.177 కోట్లకు చేరింది. మొత్తం 7 ఎకరాలు 67 సెంట్ల భూమిని ప్రముఖ ఎంఎస్ఎన్ రియాలిటీ సంస్థ రూ.1,357 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. టీజీఐఐసీ ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లుగా నిర్ణయించగా, పోటీదారుల మధ్య తీవ్ర బిడ్డింగ్‌ జరుగడంతో ధరలు ఆకాశాన్నంటాయి. చివరికి ఎంఎస్ఎన్ రియాలిటీ ఎకరానికి రూ.177 కోట్లు చెల్లించి భూమిని దక్కించుకుంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీ ప్రస్తుతం హైదరాబాదు ఐటీ హబ్‌లో అత్యంత ప్రాధాన్యత పొందిన ప్రాంతంగా మారింది. ఈ ధర దేశంలోనే అత్యంత ఖరీదైన కమర్షియల్ భూవిలువల్లో ఒకటిగా నిలిచింది. నిపుణుల వ్యాఖ్యలు: రియల్ ఎస్టేట్ నిపుణులు ఈ డీల్‌ను "హైదరాబాద్ అభివృద్ధికి ప్రతీకాత్మక ఘట్టం"గా అభివర్ణిస్తున్నారు. భవిష్యత్తులో ఈ ప్రాంతం విలువలు మరింత పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు.  సారాంశం: వేలం నిర్వాహకులు: టీజీఐఐసీ...

వృద్ధురాలిపై కానిస్టేబుల్ ఫ్యామిలీ దాడి

తెలంగాణ: హైదరాబాద్ మాదన్నపేటలో దారుణం వెలుగు చూసింది. తమ ఇంటి ముందు కుక్కకు మూత్ర విసర్జన చేయిస్తున్నాడని ఓ 60ఏళ్ల వృద్ధురాలు కానిస్టేబుల్ను ప్రశ్నించింది.  అలా చేయొద్దని వారించినందుకు కానిస్టేబుల్ భార్య, అక్క వచ్చి వృద్ధురాలిని తిడుతూ కర్రలతో దాడి చేశారు.                                 ఆ పెద్దావిడపై వాళ్లు పిడి గుద్దులు కురిపించడం CCTVలో రికార్డ్ అయింది.                                                                                 ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

సర్పంచ్ అభ్యర్థులకు ఈటెల హెచ్చరిక.

 హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికలపై సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకూడదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఆయన సూచించారు. “తొందరపడి దసరాకు దావత్‌లు ఇవ్వకండి. ఇవి లీగల్‌గా చెల్లుబాటయ్యే ఎన్నికలు కావని జాగ్రత్తగా ఉండాలి. కోర్టు రాజ్యాంగబద్ధంగా లేవని కొట్టేస్తే పరిస్థితి ఏమవుతుంది? మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు రద్దు చేసింది. అప్పట్లో పోటీదారులు భారీగా నష్టపోయారు” అని ఈటెల గుర్తుచేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం డ్రామాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్ర తరహాలో ఇక్కడా ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆయన హెచ్చరించారు. అభ్యర్థులు హడావుడిగా ఖర్చు చేయకుండా పరిస్థితి స్పష్టంగా తెలిసే వరకు ఆగాలని ఈటెల పిలుపునిచ్చారు.

బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.        బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, “ఆడబిడ్డలను మన సంతోషాల్లో భాగస్వాములను చేసినప్పుడే ఈ పండుగ నిండుదనం సంతరించుకుంటుంది” అని పేర్కొన్నారు. బతుకమ్మ కుంట కోసం జీవితాంతం పోరాడిన వి. హనుమంతరావును స్మరించుతూ ఆయనకు గౌరవప్రదమైన నివాళులు అర్పించారు. హైడ్రా ఏర్పాటు సమయంలో ఎదురైన వివాదాలు, విమర్శలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి, “ఒడిదుడుకులు వచ్చినపుడు సమయస్ఫూర్తితో పరిష్కారాలు కనుగొంటూ ముందుకు సాగాలి” అని అన్నారు. కోవిడ్‌ తరువాత వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకున్నాయని, ప్రస్తుతం కుంభవృష్టి వర్షాలు ఒకేసారి కురుస్తున్నాయని తెలిపారు. “మన వ్యవస్థ కేవలం రెండు సెంటీమీటర్ల వర్షాన్ని తట్టుకునేలా ఉన్నప్పటికీ, ఇప్పుడు విపరీత వర్షాలను ఎదుర్కొనేలా పర్యావరణ పరిరక్షణ, మౌలిక సదుపాయాల ప్రణాళికలు సిద్ధం చేశాం” అని ముఖ్యమంత్రి వివరించారు. మూసీ పునరుజ్జీవనమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రేవంత్ రెడ్డి...

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ వన్యప్రాణుల స్వాధీనం

  హైదరాబాద్ : శషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి విదేశీ వన్యప్రాణుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. బ్యాంకాక్ నుంచి హైదరాబాదుకు చేరుకున్న ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అనుమానాస్పదంగా గుర్తించి తనిఖీ చేయగా, అతని సామాను నుంచి అరుదైన వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నారు.అరుదైన జాతులు పట్టుబాటు కస్టమ్స్ అధికారుల ప్రకారం స్వాధీనం చేసిన వన్యప్రాణాల్లో ఒక మానిటర్ బల్లి, రెండు తలల ఎర్ర చెవి స్పైడర్ తాబేలు, నాలుగు ఆకుపచ్చ ఇగువానాలు, మొత్తం 12 ఇగువానాలు ఉన్నాయి. ఇవన్నీ అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉన్న అరుదైన జాతులని తెలిపారు.తిరిగి బ్యాంకాక్ తరలింపు స్వాధీనం చేసిన ఈ వన్యప్రాణులను సంబంధిత అంతర్జాతీయ నిబంధనల ప్రకారం తిరిగి బ్యాంకాక్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సంబంధిత విభాగాలతో సంప్రదింపులు జరిపిన అనంతరం తగిన చర్యలు తీసుకున్నట్లు సమాచారం.ప్రయాణికుడు అదుపులో వన్యప్రాణాలను అక్రమంగా భారత్‌కు తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో విమానాశ్రయంలో సెక్యూరిటీ విభాగాలు అప్రమత్తమయ్యాయి.

భాగ్యనగరంలో మూసీ వరద: డ్రోన్ విజువల్స్ ద్వారా సమీక్ష

హైదరాబాద్: ఉగ్రంగా ప్రవహిస్తున్న మూసీ నది మరియు మద్యపునిట్లలో పడుతున్న వరద పరిస్థితిని డ్రోన్ల ద్వారా తీసుకున్న విజువల్స్ అద్భుతంగా ప్రతిబింబిస్తున్నాయి. భాగ్యనగరంలో మూసీ నది ఉగ్ర ప్రవాహంతో విస్తరిస్తోంది, జలాలు నివాస ప్రాంతాల వద్దకు చేరుతూ ప్రమాద పరిస్థితులను సృష్టిస్తున్నాయి. హిమాయత్ సాగర్ గేట్లు ఒకేసారి ఎత్తిన దృశ్యం, భారీగా ప్రవహిస్తున్న నీటిని చూపుతూ, నగరంలోని ప్రధాన వరద నియంత్రణ విధానాలను వెల్లడిస్తుంది. రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు DRF, GHMC, RTC మరియు పోలీస్ బృందాలు కలిసి, సురక్షిత ప్రాంతాలకి వందల మంది ప్రజలను తరలిస్తున్న దృశ్యాలను డ్రోన్లు ద్వారా లైవ్‌గా నమోదుచేస్తున్నాయి. ఈ డ్రోన్ విజువల్స్, ప్రజలకు వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, ప్రభుత్వ సహాయక చర్యలను గమనించడానికి ఒక కీలక సాధనంగా మారాయి.

మూసీ వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన – హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

హైదరాబాద్: నగరాన్ని అతలాకుతలం చేస్తున్న మూసీ వరదల పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ శనివారం క్షేత్ర స్థాయిలో పర్యటించారు. కమిషనర్ చాదర్‌ఘాట్, మూసారంబాగ్, ఎంజీబీఎస్ ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితులను సమీక్షించారు. ముఖ్యంగా చాదర్‌ఘాట్ పరిసరాల్లో నది నీరు నివాస ప్రాంతాల్లోకి చేరడంతో చేపట్టిన సహాయక చర్యలను పరిశీలించారు. స్థానికులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. వరదలో ఇళ్ల పైకప్పులపై చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా ఆహారం అందించే చర్యలను కమిషనర్ ప్రత్యక్షంగా గమనించారు. ఎంజీబీఎస్ సమీపంలో రిటైనింగ్ వాల్ కూలిపోవడంతో నీరు లోపలికి ప్రవేశించిన ప్రాంతాలను కూడా పరిశీలించారు. దసరా సెలవుల నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా హైడ్రా DRF బృందాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని కమిషనర్ ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి ఎంజీబీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చొరబడినప్పుడు DRF, పోలీసులు, RTC, GHMC సిబ్బంది కలసి వందలాది ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ఆయన అభినందించారు. మూసీ వరదల దృష్ట్యా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ సూ...