Skip to main content

Posts

Showing posts with the label International

యూఎస్‌లో తల్లి, కొడుకు హత్య కేసులో ఎనిమిదేళ్ల తర్వాత దొరికిన హంతకుడు

బాపట్ల జిల్లా తిమ్మరాజుపాలెంకు చెందిన నర్రా హనుమంతరావు, ఆయన భార్య శశికళ,lకుమారుడు అనీశ్‌ సాయి (6)తో కలిసి న్యూజెర్సీలో నివసించేవారు. కాగ్నిజెంట్ కంపెనీలో పనిచేసే హనుమంతరావు... మేపుల్‌ షేడ్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో కుటుంబంతో ఉండేవారు. 2017 మార్చి 23న శశికళ, అనీశ్‌ దారుణ హత్యకు గురయ్యారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, తొలుత భర్త హనుమంతరావునే అనుమానించారు. అయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో విడిచిపెట్టారు. అదే సమయంలో హత్య జరిగిన ప్రదేశంలో హంతకుడికి సంబంధించిన రక్తపు మరకలను, డీఎన్‌ఏ నమూనాలను సేకరించారు. విచారణలో హనుమంతరావుకు, అతని సహోద్యోగి నజీర్‌ హమీద్‌కు మధ్య విభేదాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.హత్య జరిగిన ఆరు నెలల తర్వాత హమీద్‌ అమెరికాను విడిచిపెట్టి భారత్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటూ కాగ్నిజెంట్‌లో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నాడు. కేసు విచారణ కోసం డీఎన్‌ఏ నమూనా ఇవ్వాలని అమెరికా అధికారులు భారత్‌ ద్వారా హమీద్‌ను కోరగా, అతను నిరాకరించాడు. దీంతో 2024లో కోర్టు అనుమతితో హమీద్ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ల్యాప్‌టాప్‌పై లభించిన డీఎన్‌ఏను,...

కువైట్‌లో సబ్సిడీ రేషన్ అక్రమ రవాణాపై ఉక్కుపాదం–చట్టాల కఠినతరం

కువైట్ సిటీ: సబ్సిడీ రేషన్ వస్తువుల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కువైట్ సిటీ : కువైట్ పౌరులకు సబ్సిడీ ధరలకు అందిస్తున్న రేషన్ వస్తువులను దేశం వెలుపలకు అక్రమంగా తరలించే దందాపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రస్తుత చట్టాన్ని మరింత కఠినతరం చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ సబాహ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో, రేషన్ సబ్సిడీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నవారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. కేబినెట్ కీలక నిర్ణయాలు: నిబంధనల కఠినతరం: సబ్సిడీ రేషన్ వస్తువుల అక్రమ రవాణా పూర్తిగా అరికట్టడం, నిజంగా అర్హులైన కువైట్ పౌరులకే ఇవి అందేలా వ్యవస్థను కఠినతరం చేయడం. లక్ష్యం: పౌడర్ పాలు, వంట నూనె, బియ్యం వంటి సబ్సిడీ వస్తువులను విదేశీయులు తమ దేశాలకు తీసుకెళ్లడం, లేదా అక్రమ రవాణా చేయడం నిరోధించడం. కువైట్ ప్రభుత్వం ఇప్పటికే రేషన్ సబ్సిడీల ఖర్చును తగ్గించడమే కాకుండా, అవి లక్ష్యిత ప్రజలకు సమర్థవంతంగా చేరేలా చర్యలు చేపడుతోంది.

ట్రంప్‌ సంతకంతో అమెరికాలో ముగిసిన చారిత్రాత్మక షట్‌డౌన్‌

అమెరికా చరిత్రలో అత్యంత కాలం కొనసాగిన ఆర్థిక షట్‌డౌన్‌కు చివరపడింది. ప్రభుత్వ ఫండింగ్‌ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం రాత్రి సంతకం చేయడంతో 43 రోజులుగా కొనసాగిన షట్‌డౌన్‌ అధికారికంగా ముగిసింది. ఈ బిల్లు అంతకుముందు ప్రతినిధుల సభలో 222-209 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. ఫలితంగా ప్రభుత్వ విభాగాలు, సంస్థలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. దీర్ఘకాలంగా జీతాలు నిలిచిపోయిన సర్కారీ ఉద్యోగులకు ఇది ఊరటనిచ్చే పరిణామంగా మారింది. విశ్లేషకులు ఈ నిర్ణయాన్ని అమెరికా ఆర్థిక వ్యవస్థకు పాజిటివ్‌ సంకేతంగా పేర్కొంటున్నారు. 

భారత్‌తో ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నాం: ట్రంప్ కీలక ప్రకటన

  భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారుకు చాలా దగ్గరలో ఉన్నామని ఆయన వెల్లడించారు. గతంలో జరిగిన ఒప్పందాలకు ఇది పూర్తిగా భిన్నంగా, ఇరు పక్షాలకు న్యాయం చేకూర్చేలా ఉంటుందని స్పష్టం చేశారు. అందరికీ ప్రయోజనం కలిగించేలా ఈ ఒప్పందం రూపుదిద్దుకుంటోందని ట్రంప్ తెలిపారు. భారత్‌కు అమెరికా నూతన రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ట్రంప్, ఈ వ్యాఖ్యలు చేశారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్.. గోర్‌తో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్  హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీతో తనకు అద్భుతమైన సంబంధాలున్నాయని అన్నారు. అమెరికాకు ఉన్న అత్యంత ముఖ్యమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల్లో భారత్‌తో ఉన్న వ్యూహాత్మక బంధం ఒకటని ఆయన అభివర్ణించారు. "ప్రపంచంలోని పురాతన నాగరికతల్లో ఒకటైన భారత్ అద్భుతమైన దేశం. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మాకు ముఖ్యమైన ఆర్థిక, వ్యూహాత్మక భద్...

మోదీ మంచివాడే... కానీ కఠినమైన వ్యక్తి: ట్రంప్

  దక్షిణ కొరియాలో ట్రంప్ పర్యటన భారత్-పాక్ అంశంపై స్పందన  ప్రధాని మోదీ గురించి ప్రస్తావన భారత ప్రధాని నరేంద్ర మోదీ చూడటానికి ఎంతో మంచి వ్యక్తిలా కనిపిస్తారని, కానీ ఆయన చాలా కఠినమైన వ్యక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. బుధవారం తన ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో మాట్లాడిన ఆయన, భారత్‌తో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వాణిజ్య ఒప్పందంపై త్వరలోనే సంతకాలు చేస్తామని ప్రకటించారు. ఇదే సందర్భంలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని తానే ఆపానని, అందుకు మోదీ కఠిన వైఖరే కారణమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, పాకిస్థాన్‌ల విషయానికొస్తే... నేను భారత్‌తో వాణిజ్య ఒప్పందం చేసుకుంటున్నాను. నాకు ప్రధాని మోదీపై గొప్ప గౌరవం, ప్రేమ ఉన్నాయి. మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి" అని ట్రంప్ పేర్కొన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగినప్పుడు తాను మోదీకి ఫోన్ చేసి, "మీరు పాకిస్థాన్‌తో యుద్ధం ప్రారంభిస్తే మేం మీతో వాణిజ్య ఒప్పందం చేసుకోలేం" అని చెప్పినట్లు ట్రంప్ గుర్తుచేసుకున్నారు. "మోదీ చూడటానికి మంచి వ్యక్తి అయినా, ఆయన చాలా కఠినమైనవారు. యుద్ధం చేసి తీరుతామన్...

వరుసగా శక్తిమంతమైన అస్త్రాలను బయటికి తీస్తున్న రష్యా!

  అణుశక్తి ఆధారిత 'పోసిడాన్' డ్రోన్‌ను పరీక్షించిన రష్యా పరీక్ష విజయవంతమైందని ప్రకటించిన అధ్యక్షుడు పుతిన్ ఈ ఆయుధం పరిధి అపరిమితమని వెల్లడి త్వరలో 'సర్మత్' క్షిపణిని కూడా మోహరించనున్నట్లు వెల్లడి వరుసగా శక్తిమంతమైన అస్త్రాలను బయటకు తీస్తూ రష్యా దూకుడు ప్రదర్శిస్తోంది. ఇటీవల అణుశక్తితో పనిచేసే క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన మాస్కో.. తాజాగా మరో శక్తిమంతమైన ఆయుధాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అణు ఇంధనంతో పనిచేసే మానవరహిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్వయంగా ప్రకటించారు. దీని పరిధి అపరిమితమని పేర్కొనడం గమనార్హం.  సైనిక ఆసుపత్రిలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో పుతిన్ ఈ వివరాలు వెల్లడించారు. ‘అణుశక్తితో నడిచే ఆటోమేటిక్, మానవరహిత సబ్‌మెర్సిబుల్ డ్రోన్ ‘పోసిడాన్’ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. ఇది రష్యా అమ్ములపొదిలోని అత్యాధునిక ‘సర్మత్’ బాలిస్టిక్ క్షిపణి కన్నా ఎంతో శక్తిమంతమైనది. ఓ జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించాం. ఇందులో అమర్చిన అణు విద్యుత్ ప్లాంట్, వ్యూహాత్మక జలాంతర్గామిలోని రియాక్టర్ కన్నా 100 ర...

93 ఏళ్లలో తండ్రి అయిన డాక్టర్‌ — 57 ఏళ్ల వయసు తేడా కలిగిన భార్యతో బేబీ!

  ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన 93 ఏళ్ల వైద్యుడు డాక్టర్‌ జాన్‌ లెవిన్‌ మరోసారి తండ్రిగా మారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. ఆయన తన 37 ఏళ్ల భార్య డాక్టర్‌ యాంగ్‌ యింగ్‌ లూతో కలిసి ఐవీఎఫ్‌ (IVF) పద్ధతిలో 2024 ఫిబ్రవరిలో కుమారుడు గాబీకి జన్మనిచ్చారు. ఈ జంట మధ్య 57 ఏళ్ల వయసు తేడా ఉండటమే కాకుండా, లెవిన్‌ వయస్సు కారణంగా ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. డాక్టర్‌ లెవిన్‌కు ఇప్పటికే 60 ఏళ్లు దాటిన ముగ్గురు పిల్లలు, పది మంది మనవళ్లు, ఒక ముని మనవడు ఉన్నారు. అయినా కూడా ఆయన వృద్ధాప్యంలో తండ్రిగా మారడంపై చర్చలు జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కొందరు ఆయన ఉత్సాహాన్ని ప్రశంసిస్తే, మరికొందరు ఇంత వయసులో పిల్లల్ని కనడం సముచితం కాదని విమర్శిస్తున్నారు. లెవిన్‌ ప్రకారం, “వయస్సు కేవలం సంఖ్య మాత్రమే. నేను ఇంకా సజీవంగా ఉన్నాను, జీవితం పట్ల ఉత్సాహం కోల్పోలేదు. నా భార్యతో కలిసి కొత్త జీవితాన్ని స్వాగతించడం సంతోషంగా ఉంది,” అని తెలిపారు. మరోవైపు, ఆయన భార్య యాంగ్‌ యింగ్‌ లూ కూడా తన భర్త ఆరోగ్యంగా ఉన్నారని, కుమారుడితో ఆనందంగా జీవిస్తున్నారని చెప్పింది. వైద్య నిపుణులు మాత్రం పెద్ద వయసులో తల్లి...

ఆఖరికి సినిమాలనూ వదలని అమెరికా అధ్యక్షుడు

  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100 శాతం టారీఫ్ విధించారు. అయితే, అమెరికాలో నిర్మించిన చిత్రాలకు మాత్రం మినహాయింపునిచ్చారు. ట్రంప్ నిర్ణయంతో భారతీయ సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.              ఇక, సినిమా రంగంపై టారీఫ్‌లకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ తన సొంత సోషల్ మీడియా ట్రూత్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో.. ‘మన సినిమా బిజినెస్‌ను అమెరికా నుంచి దొంగిలిస్తున్నారు’ అని రాసుకొచ్చారు. కాగా, ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు సినిమాలపై పెద్దఎత్తున ప్రభావం పడనుంది. పెద్ద సినిమాలే కాకుండా చిన్న సినిమాలూ అమెరికాలో రిలీజ్ అయి కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి. ఓవర్‌సీస్ సినిమా బిజినెస్‌తో మరీ ముఖ్యంగా అమెరికా బిజినెస్‌తో తెలుగు చిత్ర పరిశ్రమ చాలా లాభపడుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఈ లాభాలకు గండిపడినట్లు అవుతుంది..

రేబిస్ మహమ్మారి పై ఆందోళన

 ప్రపంచవ్యాప్తంగా రేబిస్ వ్యాధి ప్రాణాలు బలితీస్తూనే ఉంది. డబ్ల్యూహెచ్‌వో తాజా నివేదిక ప్రకారం, ప్రతి తొమ్మిది నిమిషాలకు ఒకరు రేబిస్ వల్ల మృతి చెందుతున్నారు. ఇందులో మూడవ వంతు మరణాలు భారతదేశంలోనే సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. 2023లో భారతదేశంలోనే 284 మంది రేబిస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కోట్ల సంఖ్యలో వీధి కుక్కలు ఉండటం ఈ దుస్థితికి ప్రధాన కారణమని పార్లమెంట్‌కు సమర్పించిన ఐడీఎస్‌పీ (ఇంటిగ్రేటెడ్ డిసీస్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్) నివేదిక స్పష్టం చేసింది. పలు దేశాలు ఇప్పటికే 70% వాక్సినేషన్ లక్ష్యం సాధించి రేబిస్ నియంత్రణలో విజయవంతమయ్యాయి. అదే విధంగా భారత్ కూడా ఈ ప్రక్రియను అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రేబిస్ నివారణకు వెంటనే వాక్సినేషన్ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజల్లో అవగాహన సదస్సులు నిర్వహించడం అత్యవసరం అని డబ్ల్యూహెచ్‌వో సూచించింది.

దక్షిణ కొరియాకు అమెరికా నుండి $350 బిలియన్ డిమాండ్ – ఆర్థిక వ్యవస్థకు భారీ ముప్పు.

  సియోల్: నిత్యం సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలిచే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, తాజాగా దక్షిణ కొరియాకు ఒక అంచనాకు మించి ఉన్న వాణిజ్య ఒప్పంద ప్రతిపాదనతో వార్తల్లోకి వచ్చారు. గతంలో ఈ దేశంపై సుంకాలను విధించిన ట్రంప్, ఇప్పుడు వాటిని తగ్గించడానికి దక్షిణ కొరియాకు $350 బిలియన్ల నగదు చెల్లింపును డిమాండ్ చేశారు.                                                                                                 దక్షిణ కొరియా ప్రభుత్వం ఈ డిమాండ్ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే విధంగా ఉందని హెచ్చరించింది. జూలైలో రెండు దేశాల మధ్య సుంకాలను 25% నుండి 15%కి తగ్గించడానికి చర్చలు జరిగినప్పటికీ, ఈ కొత్త డిమాండ్ దేశానికి తీవ్రమైన ఆర్థిక ముప్పును కలిగించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు.                    ...

అమెరికా హెచ్-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లు: కొన్ని రంగాలకే మినహాయింపులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కొత్త హెచ్-1బీ వీసా ఫీజు దేశీయ ఐటీ మరియు నైపుణ్యం కలిగిన ఉద్యోగులలో తీవ్ర ఆందోళన సృష్టించింది. ఈ నెల 21 నుండి అమల్లోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం, హెచ్-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజు విధించబడింది. ఈ ఫీజు ఒక ఏడాది పాటు అమలులో ఉంటుంది. తరువాత, అమెరికా చట్టసభ (కాంగ్రెస్స్) చట్టం చేస్తే, పూర్తిస్థాయి అమలు జరుగుతుంది. మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే ఉద్యోగుల వార్షిక వేతనం సగటు 60,000–140,000 డాలర్ల మధ్య ఉండటంతో, కంపెనీలకు లక్ష డాలర్ల ఫీజు చెల్లించడం సవాలుగా మారింది. అయితే, జాతీయ ప్రాధాన్యం ఉన్న రంగాల్లో, అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కోసం మినహాయింపులు ఉండవచ్చని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. సెక్షన్ 1 (సి) ప్రకారం, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి ఈ మినహాయింపులపై అధికారం వినియోగించవచ్చు. మినహాయింపులు పొందే రంగాలు: ఫిజీషియన్లు వైద్య మరియు ఆరోగ్య పరిశోధనలు రక్షణ, జాతీయ భద్రత స్టెమ్ కార్యకలాపాలు ఇంధనం విమానయానం సైబర్ సెక్యూరిటీ అత్యంత నైపుణ్యం కలిగిన ఈ రంగాల ఉద్యోగులు లక్ష డాలర్ల ఫీజు నుంచి మినహాయింపులు పొందే అవకాశం ఉన్నందున,...

బగ్రాం ఎయిర్‌బేస్ పై ట్రంప్ హెచ్చరిక, ఆఫ్ఘన్ ప్రభుత్వ స్పందన

అమెరికా:ఆఫ్ఘనిస్థాన్‌లోని కీలకమైన బగ్రాం ఎయిర్‌బేస్ను తిరిగి అప్పగించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లేనిపక్షంలో “తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయి” అని ఆయన స్పష్టం చేశారు. ట్రంప్ తన **సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’**లో పేర్కొన్నారు, "బగ్రాం ఎయిర్‌బేస్‌ను అమెరికాకు నిర్మించిన వారికి ఆఫ్ఘనిస్థాన్ తిరిగి అప్పగించకపోతే, తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి." ఇప్పటికే ఈ స్థావరాన్ని తిరిగి పొందేందుకు ఆఫ్ఘన్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆయన శుక్రవారం విలేకరులకు తెలిపారు. ట్రంప్ వ్యాఖ్యలను ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తాలిబన్ పాలనలోని ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ సీనియర్ దౌత్యవేత్త జలాలీ శనివారం మీడియాకు వివరించగా, “తమ భూమిపై విదేశీ సైనిక ఉనికిని ఎప్పటికీ అంగీకరించబోము. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా మాత్రమే అమెరికాతో ఆర్థిక, రాజకీయ సంబంధాలు కొనసాగించాలి” అని వెల్లడించారు.