రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన కళ్యాణదుర్గం రూ.920 కోట్ల ఈ–స్టాంప్ కుంభకోణం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కాంలో టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు ప్రమేయం ఉందంటూ వైయస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ తలారి రంగయ్య దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. కేసులో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. విచారణకు హాజరైన ఈడీ అధికారులు, ఈ స్కామ్‌కు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా పరిశీలిస్తున్నామని, త్వరలో కౌంటర్ దాఖలు చేస్తామని కోర్టుకు తెలిపారు. భారీ పరిమాణంలో నకిలీ ఈ–స్టాంప్ పేపర్లు కళ్యాణదుర్గం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఈ–స్టాంప్ స్కాం విలువ రూ.920 కోట్లకు చేరుతుందని అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించిన ఎర్రప్ప అలియాస్ ‘మీసేవ బాబు’ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీసేవ బాబు ఇంట్లో నిర్వహించిన సోదాల్లో పెద్ద మొత్తంలో నకిలీ ఈ–స్టాంప్ పత్రాలు, రబ్బరు స్టాంపులు, కీలక రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో మీసేవ బాబు 13,000 నకిలీ ఈ–స్టాంప్ పత్రాలను ట్యాంపరిం...
Local to international