గతంలో ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు పలుమార్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఆ నిరసనలను ఖమేనీ ప్రభుత్వం కఠినంగా అణచివేసిందని అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది ప్రజలు ఈ వార్తలపై సంబరాలు చేసుకున్నట్లు సమాచారం.
ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని వ్యాఖ్యానించినట్లు రిపోర్ట్స్ వెలువడుతున్నాయి. దీనితో ప్రాంతీయ ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఖమేనీ మరణంపై అధికారికంగా ఇరాన్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ధృవీకరణ ఇప్పటివరకు వెలువడలేదు. కాబట్టి ఈ వార్తల నిజానిజాలపై స్పష్టత రావాల్సి ఉంది.
