తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || International Kuwait February 28, 2026

ఫర్వానియా ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ ప్రధాని

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 వైద్య బృందంతో సమీక్ష… మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం
డ్రోన్ దాడి బాధితులకు అండగా ఉంటామని భరోసా.
కువైట్ సిటీ, : కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడిలో గాయపడిన వారిని కువైట్ ప్రధాని గౌరవనీయులు షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్-అహ్మద్ అల్-సబా ఆదివారం ఫర్వానియా ఆసుపత్రిలో పరామర్శించారు. చికిత్స పొందుతున్న స్వదేశీయులు మరియు విదేశీ నివాసితుల ఆరోగ్య పరిస్థితిని ఆయన వ్యక్తిగతంగా తెలుసుకున్నారు.
ప్రధాని ఆసుపత్రిలోని ప్రతి వార్డుకి వెళ్ళి బాధితులతో స్వయంగా సమావేశమయ్యారు. వారిని ధైర్యపరచుతూ, గాయపడిన తొమ్మిది సిబ్బందికి అందుతున్న వైద్య సదుపాయాలపై వైద్య బృందంతో సమీక్ష నిర్వహించారు. బాధితులకు అత్యుత్తమ, నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, త్వరగా కోలుకోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.ఈ సందర్భంలో వైద్యులు ప్రధానికి రోగుల ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక అందించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. దేశ ప్రజల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
ప్రధానమంత్రి వెంట పలువురు ఉన్నతాధికారులు, మంత్రిత్వ శాఖ ప్రతినిధులు కూడా ఉన్నారు.