తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Amaravati Andhra Pradesh March 16, 2026

ఢిల్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన.. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌పై కేంద్రంతో కీలక చర్చలు.

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

ఢిల్లీ, మార్చి 16: పయ్యావుల కేశవ్ నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధిన కీలక అంశాలపై ఢిల్లీలో చర్చలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండగా, ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కార్యదర్శి అనురాధ ఠాకూర్  తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం.

రాయలసీమ హార్టికల్చర్ హబ్‌పై చర్చ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రతిపాదించిన ‘రాయలసీమ హార్టికల్చర్ హబ్’ ప్రాజెక్టు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించడం, రైతులకు గిట్టుబాటు ధరలు అందించడం, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులను పెంచడం ఈ ప్రాజెక్టు ముఖ్య లక్ష్యాలు అని మంత్రి వివరించారు.

కేంద్ర సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం

ఈ ప్రాజెక్టు అమలుకు అవసరమైన ఆర్థిక సహాయం, సాంకేతిక మద్దతు, అలాగే కేంద్రం నుంచి అవసరమైన అనుమతుల విషయంపై మంత్రి కేంద్ర అధికారులతో చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు సమగ్రంగా వివరించినట్లు తెలిసింది.

రాష్ట్ర ఆర్థిక అంశాలపై కూడా చర్చ

హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుతో పాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు వంటి అంశాలపై కూడా ప్రాథమిక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) మరియు దాని వల్ల కలిగే ప్రయోజనాలను కేంద్ర కార్యదర్శికి వివరించారు.

రాయలసీమ అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న ఈ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టుపై కేంద్ర అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన రాష్ట్ర వ్యవసాయ మరియు ఆర్థిక రంగాలకు కీలకంగా మారే అవకాశముంది.