తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ March 01, 2026

అనంతపురంలో ‘స్త్రీ శక్తి పంచకం’ కార్యక్రమం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 

అనంతపురం, మార్చి 1: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న మహిళల ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ‘స్త్రీ శక్తి పంచకం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. దేశ ప్రధాని Narendra Modi నాయకత్వంలో చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చే దిశగా రూపొందించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషీద రాజు సూచనల మేరకు జిల్లా అధ్యక్షుడు కొనకొండ్ల రాజేష్ సమక్షంలో ఈ కార్యక్రమం జరుగనుంది. జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సౌభాగ్య దగ్గుపాటి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవగాహన సమావేశంలో మహిళల ఆరోగ్యం, పోషకాహారం, నిరోధక వైద్యం వంటి అంశాలపై నిపుణులు ప్రసంగించనున్నారు.

మార్చి 8న ఉదయం 10.30 గంటలకు అనంతపురం జిల్లా బీజేపీ కార్యాలయంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. జిల్లాలోని మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. పాల్గొనదలచిన వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారుhttps://www.saffronwarriors.com/registersakthi.php.