రక్తదాత మహా దాత డ్రైవర్ కృష్ణ అనంతపురం: ఆపదలో ఉన్న వారికి అండగా నిలుస్తూ.. ఆపన్న హస్తం అందిస్తున్న క్యాబ్ డ్రైవర్ కృష్ణ సేవలు అభినందనీయమని వామపక్ష నాయకులు కొనియాడారు. వృత్తిరీత్యా క్యాబ్ నడుపుతూ జీవనం సాగిస్తున్న కృష్ణ, ఇప్పటివరకు 40 సార్లు రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను కాపాడారు. ఆయన నిరుపమాన సేవలను గుర్తించిన వామపక్ష నేతలు మంగళవారం ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రక్తదానం మహాదానమని, పేదల పట్ల కృష్ణ చూపిస్తున్న చొరవ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఎప్పుడు ఏ సమయంలో ఎవరు అడిగినా కాదనకుండా రక్తదానం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారని ప్రశంసించారు. అనంతరం ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు.కృష్ణ సేవలను అభినందించిన వారిలో మాలపాటి శ్రీనివాసులు, మీనుగ మధుబాబు, కురువ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. |
True Times India
రక్త దాతకు ఘన సన్మానం
|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)