తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Rayadurgam March 01, 2026

బిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిందనూరు నాగరాజు నియామకం

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

అమరావతి : బహుజన సమాజ్ పార్టీ (బిఎస్పీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చిందనూరు నాగరాజును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆదివారం నియామక పత్రం అందజేశారు. ఇంతకుముందు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాగరాజుకు పదోన్నతి కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్, రాష్ట్ర కోఆర్డినేటర్లు, జాతీయ కోఆర్డినేటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా బిఎస్పీ జాతీయ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తానని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఎస్పీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని చెప్పారు. పార్టీ బలోపేతం, విస్తరణ కోసం తన శక్తివంచన లేకుండా శ్రమిస్తానని, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.

దేశవ్యాప్తంగా బహుజన సమాజ్ పార్టీ మరింత బలపడేలా కృషి చేస్తానని, పార్టీ ఆశయాల సాధన కోసం కట్టుబడి పనిచేస్తానని పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.