ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రారంభించడం విశేషం. ఇందులో భాగంగా నెల్లూరు పట్టణంలో సుమారు 10,000 మంది వయోజనులను గుర్తించి వారికి శిక్షణ అందించారు.
ఈ రోజు 15 మార్చి 2026న శిక్షణ పొందిన వయోజనులకు ఫైనల్ అసెస్మెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షకు వయోజనులు ఎంతో ఉత్సాహంగా హాజరై పరీక్ష రాయడం కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన డిఆర్డిఏ పీడీ మరియు సిబ్బంది, మెప్మా పీడీ మరియు శాఖ సిబ్బంది, మండల అభివృద్ధి అధికారులు, ఐసిడిఎస్ పీడీ మరియు సిబ్బంది, జిల్లా విద్యాశాఖ అధికారి మరియు విద్యాశాఖ సిబ్బంది, స్వర్ణ గ్రామ మరియు స్వర్ణ వార్డ్ సిబ్బంది, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఏడీసీలు మరియు మున్సిపల్ సిబ్బంది అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు వయోజన విద్యాశాఖ అక్షరాంద్ర నోడల్ అధికారి మల్లు మస్తాన్ రెడ్డి తెలిపారు.