గుర్తు తెలియని బాలుడు దారుణ హత్య


చిత్తూరు జిల్లా, మార్చి 15:  వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బంధార్లపల్లి గ్రామం సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని బాలుడు శవం కాలిపోయిన స్థితిలో లభ్యమైంది.

పోలీసుల సమాచారం మేరకు, పూలవారి కండ్రిగ గ్రామానికి వెళ్లే అటవీ మార్గంలో మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో గ్రామస్తులు శవాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, సుమారు 16 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, పాత కారు టైర్లతో కాల్చివేసినట్లు అనుమానిస్తున్నారు.

శవం పూర్తిగా కాలిపోవడంతో గుర్తించడం కష్టంగా మారింది. సంఘటన స్థలంలో నల్లటి పూసలు 10, ఎర్రటి పూసలు 2, రెండు బీగాం చెవులు, డెనిమ్ జీన్స్ ప్యాంటు గుండీలు, ఒక పిన్నీసు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.

ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, శవం గుర్తింపు కోసం ప్రజల సహకారం కోరుతున్నారు. ఎవరైనా ఇటీవల కనిపించకుండా పోయిన బాలుడి వివరాలు తెలిసినవారు లేదా సంఘటనకు సంబంధించిన సమాచారం ఉన్నవారు కార్వేటినగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ (9440900689), వెదురుకుప్పం సబ్ ఇన్స్పెక్టర్ (9440900691)లను సంప్రదించాలని సూచించారు. సమాచారం అందించిన వారికి తగిన పారితోషకం అందజేయనున్నట్లు తెలిపారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ