కేవిఆర్.. విశ్లేషకులు
కేవలం 30 మంది పనిచేయగలిగిన మిల్క్ ప్రాసెసింగ్ టెక్నాలజీ అప్డేట్, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కి నిన్న జరిగిన క్యాబినెట్ లో 200 కోట్లు ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపి,విద్యుత్తు రాయితీ యూనిట్ కు రూపాయి చొప్పున నూరు కోట్లు,ఐదేళ్లపాటు మూడు శాతం ఎస్జిఎల్టి రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని తీర్మానం చేశారు. కానీ 2024 ఎన్నికల ముందు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో అనంతపురం జిల్లా తాడిపత్రి ప్రాంతంలో గల గ్రానైట్,కడప స్లాబ్ పరిశ్రమల యజమానులకు, ఇక్కడి MSME లకు,దళిత పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరములు గడుస్తున్నా ఇంతవరకు అతీగతీలేదు.ఇవ్వకపోగా గత వైసిపి ప్రభుత్వం కంటే ఎక్కువగా ఈ పరిశ్రమలకు కరెంట్ బిల్లులు,రాయల్టీ పెంచడం,అనధికార చెక్ పోస్టులను పెట్టడం వల్ల పరిశ్రమలు మూతపడ్డాయి.
మరి లోకేష్ గారు తమ కుటుంబ కంపెనీ అయిన హెరిటేజ్ కు కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చుకుని కరువు ప్రాంతమైన తాడిపత్రి పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకపోవడం ఏమిటని ఇక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వీటిని ప్రోత్సహించడం వల్ల కరువు సీమలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించవచ్చు, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచవచ్చు.
కారు చౌకగా భూములను అమ్మేస్తూ, సొంత కంపెనీలకు మాత్రమే రాయితీలు ఇస్తూ, సొంత మీడియాలో ప్రకటనల రూపంలో వేలకోట్ల ప్రజాధనాన్ని దొబ్బేస్తుంటే మద్యస్థంగా ఉన్న ప్రజల కంపెనీలను,పరిశ్రమలను మైన్సును మూతపడేలా చేస్తూ సామాన్య ప్రజల బ్రతుకు మీద భరోసా లేకుండా చేస్తున్నారు.
*ఏమిరా బాలరాజు నీవల్ల వలన ఉపయోగం* అన్నట్లు,ప్రైవేట్ ట్రావెల్స్,మైన్స్, ప్రైవేట్ హాస్పిటల్స్,ప్రైవేటు విద్యాసంస్థలు కూడా రాయితీలు ఇవ్వవచ్చు కదా *ఏమిటి లోకేష్ నీ వల్ల ఉపయోగం* అంటున్నారు.
మీ బంధువులకు,మీ బినామీ వ్యాపారులకు 90 పైసలకే వేల ఎకరాల భూములు,ఇచ్చి, శ్రీలంక నేపాల్ మరియు పాకిస్థాన్ రాజకీయ నాయకులు మాదిరి సంపాదించి,ఆ అవినీతి డబ్బులు విదేశాల్లో భద్రంగా దాచుకొని,మీ కుటుంబాలు వేరే దేశాలకు వెళ్ళిపోండి లేకపోతే శ్రీలంక,నేపాల్ లో లాగా ప్రజా చైతన్యం వచ్చి, మీకు కూడా అదే గతి పట్టే కాలం ఎంతో దూరం ఉండదు.
