తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ March 12, 2026

వజ్రకరూరులో గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ టీకా పంపిణీ

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

వజ్రకరూరులో హెచ్‌పీవీ టీకా కార్యక్రమం ప్రారంభం

వజ్రకరూరు: గర్భాశయ ముఖ క్యాన్సర్ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని వైద్యాధికారులు డా. తేజస్వి, డాక్టర్ సర్దార్ వలి పిలుపునిచ్చారు. వజ్రకరూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్‌సీ)లో 14 నుంచి 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్‌పీవీ (HPV) టీకా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మోనాలిసా, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత బెంజిమెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ గర్భాశయ క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ టీకా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 14 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాను అందిస్తున్నదని, ఈ టీకాను ఒకే డోసుగా ఇవ్వనున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ముఖ్యంగా లైంగిక క్రియాశీలత ప్రారంభం కంటే ముందే ఈ టీకా వేయించుకుంటే 80 శాతం కంటే ఎక్కువ రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు.

టీకా వేయించుకున్న బాలికలకు ప్రత్యేక సర్టిఫికెట్ కూడా అందజేస్తామని అధికారులు తెలిపారు. గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడానికి ఈ టీకా ఎంతో ప్రభావవంతమని, తల్లిదండ్రులు తమ కుమార్తెలకు తప్పనిసరిగా టీకా వేయించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్‌ఈఓ గురుప్రసాద్, కుమార్ స్వామి, హెల్త్ ఎడ్యుకేటర్ సత్యనారాయణ, సూపర్వైజర్ నాగశంకర్, హెల్త్ అసిస్టెంట్లు నాగరాజు, సంపత్ కుమార్, సీనియర్ ఏఎన్‌ఎం పద్మ, జూనియర్ ఏఎన్‌ఎం పద్మ, ఏఎన్‌ఎంలు లక్ష్మి, జ్యోతి, రాజేశ్వరి, సురేఖ, కోమల, జయమ్మ, అరుణ జ్యోతి, ఎంఎల్‌హెచ్‌పీలు భారతి, అమృత, బాలచౌడేశ్వరి, లక్ష్మీకాంతమ్మ, సుధా మాధురి, ఫార్మసిస్ట్ రామచంద్ర నాయక్, ఆశా కార్యకర్తలు, బాలికలు తదితరులు పాల్గొన్నారు.