* కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి
* ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం తప్పదు: జిల్లా నేతలు
ఉరవకొండ, (మార్చి 13):
సిపిఐ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారం కోసం 'గడపగడపకు సిపిఐ' కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. శుక్రవారం ఉరవకొండ పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. కేశవరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు పార్వతీ ప్రసాద్ మరియు నియోజకవర్గ కార్యదర్శి బి. చెన్నరాయుడు పాల్గొన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం:
ఈ సందర్భంగా బి. కేశవరెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించి, వారిని చైతన్యవంతులను చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాలకు సన్నద్ధం:
ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహిస్తామని నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ప్రజల నుండి విరాళాలు సేకరిస్తున్నామని, ఆ నిధులతో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శులు సుల్తాన్, నాగేంద్ర, పట్టణ కార్యదర్శి మోహన్, నాయకులు బసవరాజు, మల రాముడు, మంచినీళ్ల ప్రసాద్, మహిళా సమైక్య నాయకులు నూర్జహాన్, వన్నూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
