తాజా వార్తలు
True Times India
ఎడిటర్: SV || Andhra Pradesh Uravakonda March 07, 2026

మైలారం పల్లి లో అగ్నిప్రమాదం చీని తోట దగ్ధం.

|
ఈ-పేపర్ ప్రింట్ (PDF)

 

​ఉరవకొండ : అమాయక రైతు కష్టాన్ని విద్యుత్ ప్రమాదం బూడిద చేసింది. ఉరవకొండ మండలం మైలారం పల్లి గ్రామంలో శనివారం జరిగిన అగ్నిప్రమాదంలో ఒక రైతుకు భారీ ఆస్తి నష్టం సంభవించింది. స్థానికులు మరియు బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం..

​గ్రామ శివారులోని చీని తోట సమీపంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లో ఒక్కసారిగా నిప్పులు చెలరేగాయి. ఆ నిప్పుకణాలు ఎండిన గడ్డిపై పడటంతో మంటలు వేగంగా తోటలోకి వ్యాపించాయి. ఈ క్రమంలో తోటలోని చీని చెట్లతో పాటు, సాగుకు ఏర్పాటు చేసుకున్న డ్రిప్ పరికరాలు (పైపులు, నోజిళ్లు) మంటలకు పూర్తిగా ఆహుతయ్యాయి.​రూ. 5 లక్షల నష్టం

​ఈ అగ్నిప్రమాదంలో దాదాపు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అప్పులు చేసి నిర్మించుకున్న డ్రిప్ సిస్టమ్ కాలిపోవడంతో ఆ రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.​కంటికి రెప్పలా కాపాడుకున్న తోట, చేతికొచ్చే సమయంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల బూడిదైపోయింది. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.​

​విద్యుత్ అధికారుల నిర్వహణ లోపం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితుడికి నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు.