కేవీ రమణ.. రాజకీయ విశ్లేషకులు.
ఉరవకొండ మన జన ప్రగతి మార్చి 18:శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులుగా ఉండాలని పార్లమెంటులో నిర్ణయించారు.
అలాగే బచావత్ ట్రిబ్యునల్ కూడా శ్రీశైలం కనీస నీటిమట్టాన్ని 854 అడుగులుగా నిర్దేశించింది.
శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా జలవిద్యుత్ కేంద్రం కాదని కూడా బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
నాగార్జున సాగర్ ఆయకట్టుకు 264 టీఎంసీలు మరియు కృష్ణా డెల్టా ఆయకట్టుకు 80 టీఎంసీలు మొత్తం 344 టీఎంసీలు కేటాయించిన నీటిని మాత్రమే ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయాలి.
ఈ నీటికి అదనంగా శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరే కృష్ణా జలాల పంపిణీని తరువాత ఏర్పడే ట్రిబ్యునల్ నిర్ణయిస్తుందని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది.
అలాగే శ్రీశైలం రిజర్వాయర్ నుండి ఎస్ ఆర్ బి సీ ద్వారా (SRBC)మద్రాసు త్రాగునీటికి చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయి.
రాష్ట్ర విభజన చట్టం కూడా తెలుగుగంగ,గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టులకు శ్రీశైలం జలాలను వినియోగించుకొనే హక్కును కల్పించింది.
జీ.ఓ.నెంబర్10,తేదీ 22-1-2004.
జీ.ఓ.నెంబర్ 3,తేదీ 4-1- 2006.
జీ.ఓ.నెంబర్ 196,తేదీ 31- 8-2007.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 సెక్షన్ 85( 7) షెడ్యూల్ (lX)
జీ.ఓ.నెంబర్ 107,తేదీ 28-9- 2004.
అలాగే 29-3-2016 న ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి చేసిన ప్రకటన. తదితర జీ.ఓ లు,ఉత్తర్వులు మరియు అంతర్గత సర్దుబాట్లను పరిగణలోకి తీసుకొని భవిష్యత్తులో త్రాగునీటికి,సాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా జల సంరక్షణ చేస్తూ రాయలసీమ హక్కులను కాపాడాలి.
వీటి దృష్ట్యా మన నీటి హక్కులపై స్పష్టమైన అవగాహన కలిగి మనకు రావాల్సిన నీటిని రాబట్టుకోవాలి.అప్పుడే ఆ జీ.ఓ.లకు,ఉత్తర్వులకు విలువ ఉంటుంది.అప్పుడే అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరుగుతుంది. ఏ ప్రాంతానికి చేరాల్సిన నీరు ఆ ప్రాంతానికి చేరుతుంది. అత్యంత వెనుకబడిన రాయలసీమ వాటా నీరు రాయలసీమకు చేరి, సశ్యామలమవుతుంది. అవగాహన లేకపోతే వెనుకబడిన ప్రాంతాలు మరింత వెనుకబడి పోతాయి.
