రాజకీయ విశ్లేషకులు రమణ కే.వి.
2:అధికారం చుట్టూ రాజకీయాలను తిప్పడం మూలంగా చట్ట సభలు అలంకార ప్రాయాలుగా మారిపోయాయి.
రాజకీయాలలో శాశ్వత శత్రువులు,శాశ్వత మిత్రులు ఉండరు అన్నది ఒకనాటి మాట.ఎన్ని అడ్డ దారులైనా తొక్కి,ఎవరితో నైనా,ఎంత మందితో నైనా జతకట్టి అధికారం చేపట్టాలన్నది నేటి మాట.అందుకే చట్ట సభలు ధనవంతులు,పెత్తందారులు, అవినీతి పరులతో నిండిపోయి. పేద,మధ్యతరగతి,నీతిమంతులు,విజ్ఞులు అక్కడ కనబడరు. కొంతమంది వంశపారంపర్యంగా రాజకీయాలలో ఉండిపోతే మరి కొంతమందికి రాజకీయాలు అంటే ఏమిటో తెలియని పరిస్థితి,అందుకే రాజకీయ సమానత్వం లేక ప్రజా పాలన కంటే,అధికార పెత్తనంతో,ధనవంతులు మరింత ధనవంతులుగా,పేదలు మరింత పేదలుగా మారిపోతున్నారు.
ఒకప్పుడు రాజకీయ పార్టీలకు విలువలు, విశ్వసనీయత,నీతి నిజాయితీలు,రాజనీతిజ్ఞత అనే సిద్ధాంతాలు ఉండేవి.నేడు అవి రాజకీయాలకు అనార్హతలు.గెలుపే ఏకైక లక్ష్యం.
అందుకే ఎలక్షన్ కమిషన్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాష్ట్రపతి ఎన్నికలు,ఈడి, సిబిఐ,ఏసీబీ తదితర స్వతంత్ర సంస్థలు అధికారం చేతిలో కీలుబొమ్మలై ప్రత్యర్థులను వేటాడడానికి ఉపయోగ పడే అస్త్రాలుగా మిగిలిపోయాయి.
రెట్టింపు సేవ చేసి గెలవాలన్నది నాటి రాజకీయం.ప్రత్యర్థులను మట్టు పెట్టి గెలవడం నేటి రాజకీయం.
ఈ కోవకు చెందిన నాయకులు దేశంలో ఇద్దరే కనబడతారు.అది ఒకటి మోదీ,రెండు చంద్రబాబు.వీరికి నేటి శత్రువులు రేపు మిత్రులు, రేపటి మిత్రులు,ఆ తరువాత శత్రువులు.వీరికి గెలుపే లక్ష్యం,అధికారమే పరమావధి.
చంద్రబాబు రాజకీయ ప్రస్థానం చూస్తే స్వతంత్ర రాజకీయాలు,సొంత పార్టీ ఎక్కడా కనపడవు.అయినా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రి.
అదే కోవలో మోడీ,గెలిచిన వాడే మనవాడుగా భావించి సొంత బలం లేకపోయినా సుదీర్ఘకాలం ప్రధాని,వీరిద్దరి లక్ష్యం అధికారమే.
అవసరార్థం ఎవరితోనైనా జత కడతారు.అవసరం తీరాక వారినే కూలదోసి, వెన్నుపోటు పొడవడం వీరికి వెన్నతో పెట్టిన విద్య.
వీరి పొత్తులు,ఎత్తులు చూసిన తర్వాత ఒంటరిగా పోటీ చేయడమే తప్పు, చేతగానితనం,అనే స్థాయికి వెళ్ళి పోయాయి నేటి రాజకీయాలు.
వీరితో దేశానికి,రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు అప్పులు, తిప్పలు,అవినీతికి చట్టబద్ధత తప్ప.అయినా తమ చేతులకు అవినీతి మరకలు అంటని చతురత.ఇదే నేటి తరానికి వీరు ఇచ్చే సందేశం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్,తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అంతవరకు కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు,మామ చెంతకు చేరి,కూల దోసి,ముఖ్యమంత్రి అయ్యి,అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని బిజెపి,మోడీని ఆడి పోసుకుని ముఖ్యమంత్రి అయ్యాడు.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆడి పోసుకున్న అదే మోడీ దేవుడయ్యాడు.బిజెపి తో పొత్తు పెట్టుకుని తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు.ఆ తరువాత అదే పొగిడిన నోటితో మరల మోడీని ఆడిపోసుకున్నాడు,ఈ దేశానికి పట్టిన శని అన్నాడు, భార్యను చూడలేని వాడు దేశాన్ని ఎలా చూస్తాడని ప్రచారం చేసాడు, కమ్యూనిస్టులతో అంట కాగిన ఈ పెద్ద మనిషి,టూరిజం తప్ప ఏయిజం లేదని అవమానపరిచి,తిరిగి అదే కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకున్నాడు.
ఆ తరువాత మరలా బిజెపి అండ పిండ బ్రహ్మాండమని పొగిడి పొత్తు పెట్టుకుని 2024లో తిరిగి ముఖ్యమంత్రి అయ్యాడు. అందుకే చంద్రబాబుతో కలిసే వారికి సిగ్గులేదు, తెలుగుదేశానికి మతి లేదు అంటారు.అందుకే వీరికి ప్రజా పాలన కంటే అధికారమే పరమావధి.
దేశంలో మోదీ ఏమో రెండో రాజకీయ పార్టీ ఉండకూడదు అంటాడు, భిన్న జాతులు,మతాలు, కులాలు,సంస్కృతులు కలిగిన దేశంలో ఒకే పార్టీ,ఒకే ప్రభుత్వం,ఒకే భాష,ఒకే తిండి,ఒకే దుస్తులు,అని చెబుతూ నియంతృత్వాన్ని నడిపిస్తూ,తనతో జతకట్టిన పార్టీలను తుద ముట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి,పేద వర్గాలను మట్టు పెట్టి,దేశాన్ని తాకట్టు పెడితే, రాష్ట్రంలో చంద్రబాబు పీకల లోతు అవినీతిలో కూరుకుపోయి,50 రోజులు జైలుకి వెళ్లి,ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేక,రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, అమరావతి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనే పేరుతో భూదందాలు చేస్తూ,పేదల భూములు కాజేసి,కోట్లు కొల్లగొడుతూ,పాలన కంటే అధికారమే ముఖ్యమని ముందుకెళుతున్నాడు. అందుకే దేశంలో మోడీకి, రాష్ట్రంలో చంద్రబాబుకు రాజకీయంగా దగ్గర పోలికలు కనబడతాయి.దేశంలో, రాష్ట్రంలో అధికారం చుట్టూ రాజకీయాలను తిప్పుతూ చట్టసభలను అలంకారప్రాయాలుగా మార్చేసారు.
