ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు: ఉక్కిసుల గోపాల్ నివాళి
ఉరవకొండ: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన మహనీయుడు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి వేడుకలు ఉరవకొండ పట్టణంలో సోమవారం ఘనంగా జరిగాయి. స్థానిక పొట్టి శ్రీరాములు సర్కిల్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆయన త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం
ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త ఉక్కిసుల గోపాల్ మాట్లాడుతూ.. "పొట్టి శ్రీరాములు గారు కేవలం ఒక ప్రాంతానికో, వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మార్గదర్శి" అని కొనియాడారు. 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి కారణభూతులయ్యారని గుర్తు చేశారు. మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ సత్యం, అహింస, మరియు హరిజనోద్ధరణ వంటి ఆశయాల కోసం తన జీవితాంతం కృషి చేసిన మహాపురుషుడు అని ఆయన ప్రశంసించారు.
భావితరాలకు ఆయన త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పాటిల్ నిరంజన్ గౌడ్, ఆటో శీను, లెనిన్ బాబు, రాము, సాయి వేణు గౌడ్, శంకర సుదర్శన్, చాబల ఈశ్వర్, అనిల్ రెడ్డి, మురళి, పుల్లయ్య, నవీన్, సాయి సుందర్ మరియు పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.
