ఉరవకొండ మార్చి 17:
కూటమి ప్రభుత్వం అభద్రతా భావనకు లోనై ప్రజలకు భయపడుతున్నది. ఎందుకని పరిశీలిస్తే ఒకవైపు ఎన్నికల హామీలను నెరవేర్చలేక,ప్రజల సంతృప్త స్థాయిని చేరుకోలేకపోవడం, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి వేయడం,అభివృద్ధిని అంతా ఒక ప్రాంతంలో కేంద్రీకరించడం.రెండోవైపు విపరీతమైన అవినీతి,డ్రగ్స్,క్లబ్స్ రొమాన్స్,వైన్స్, మైన్స్,న్యూసెన్స్ లలో తమ ప్రజాప్రతినిధులు రోజు కొక్కరు పట్టుబడుతుంటే, కంట్రోల్ చేయలేని పరిస్థితులలో,ప్రశ్నించే గొంతులను నొక్కడం,అక్రమ కేసులు,భౌతిక దాడులకు పూనుకున్నది.
ఉదాహరణకు రొమాన్స్ లో పట్టుబడిన టిటిడి చైర్మన్ బి.ఆర్.నాయుడు గారిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని తిరుపతిలో మహిళలు ఆందోళన చేస్తే వారిపై దాడి చేయడంతో పాటు,వారిపైనే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం.
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తానని గొప్పలు చెప్పిన చంద్రబాబు,తన పార్టీకే చెందిన ఎంపీ డ్రగ్స్ తీసుకొని పట్టుబడటం.
తన కూటమికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాసక్రీడలలో ఇరుక్కుపోవడం.
ఈ సందర్భంగా చర్యలు తీసుకోవడంలో అయినవారికి ఆకులు,కాని వారికి కంచం అన్నట్లు తన సామాజిక వర్గానికి చెందిన వారి పట్ల ఉదారత,ఇతర సామాజిక వర్గాల పట్ల కఠినంగా వ్యవహరించడం ఆ పార్టీలోనే కలకలం రేపుతున్నది.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ప్రభుత్వాన్ని వెలగబెడుతున్న పెద్ద మనుషులు తమ తప్పులను తెలుసుకొని, సర్దిద్దుకొని ముందుకు వెళితే భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే ఇలాంటి దుర్మార్గ ప్రభుత్వాలను ప్రజలు శంకరగిరి మాన్యాలు పట్టిస్తారని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు,పేర్కొన్నారు.
