ఏపీ కౌలు రైతు సంఘం జిల్లా కమిటీ ఎన్నిక

 

జిల్లా అధ్యక్షుడిగా బి. వెంకటేష్, 

ఉరవకొండ, ఏప్రిల్ 08: ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం మూడవ జిల్లా మహాసభలు ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సంఘానికి నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
జిల్లా అధ్యక్షుడిగా బి. వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా ఏ. రంగారెడ్డి, కోశాధికారిగా ఎం. బాల రంగయ్య ఎన్నికయ్యారు. వీరితో పాటు జిల్లా కార్యవర్గంలో మరో 15 మంది సభ్యులను కూడా ఎన్నుకున్నారు.
నూతన కమిటీలో హెచ్. రామాంజనేయులు, ఎం. వెంకటేశు, ఎం. నారాయణస్వామి, వై. సీనప్ప, సి. ఈరమ్మ, ధనుంజయ, ప్రభాకర్, సుంకన్న, ఎర్రి స్వామి, చౌడమ్మ, అనసూయమ్మ, నరసింహులు తదితరులు సభ్యులుగా ఉన్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ నాయకులు మాట్లాడుతూ కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుండి అందాల్సిన సంక్షేమ పథకాలు, రుణ అర్హత కార్డులు (CCRC) ప్రతి కౌలు రైతుకు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సంఘ నాయకత్వానికి, సభ్యులకు నూతన కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ