ప్రేమోన్మాదికి కఠిన శిక్ష: మంత్రి సవిత హెచ్చరిక

కడప: కడప జిల్లా ఖాజీపేటలో విద్యార్థిని హత్య ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి సవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మంత్రి మాట్లాడుతూ, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తీసుకొచ్చి యువతి ఇంటికే వెళ్లి గొంతు కోసి హత్య చేయడం అత్యంత దారుణమని ఖండించారు. నిందితుడు శ్రీనివాస్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మహిళలు, బాలికలపై ఇలాంటి దారుణాలకు పాల్పడేవారిని ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి నిందితుడికి గరిష్ట శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, ప్రజలు నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ