బీజేపీది నినాదం కాదు… దేశాభివృద్ధికి నిదర్శనం: దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్


అనంతపురం, ఏప్రిల్‌ 12 :మహిళా సాధికారత దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశ అభివృద్ధికి బలమైన పునాదులు వేస్తున్నాయని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు దగ్గుపాటి సౌభాగ్య శ్రీరామ్ పేర్కొన్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే నిర్ణయం చారిత్రాత్మకమని ఆమె అభివర్ణించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకు మహిళా లోకం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

మహిళా అభివృద్ధి కేవలం నినాదంగా కాకుండా కార్యాచరణలో చూపుతున్న ప్రభుత్వం ఇదేనని సౌభాగ్య శ్రీరామ్ అన్నారు. ఒక మహిళ ఎదిగితే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో కేంద్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఆడపిల్ల పుట్టడం భారంగా భావించే రోజుల నుంచి, ఆశీర్వాదంగా భావించే దిశగా సమాజంలో మార్పు తీసుకురావడంలో ప్రభుత్వ పథకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.

🔹 పథకాలతో మహిళల సాధికారత

గత కొన్నేళ్లుగా మహిళల ఆర్థిక, సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయని ఆమె వివరించారు.

ముద్రా యోజన ద్వారా పూచికత్తు లేకుండా రుణాలు పొందుతూ మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేస్తున్నారని చెప్పారు.

సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో – బేటీ పడావో వంటి పథకాలు ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా కల్పిస్తున్నాయని తెలిపారు.

ప్రధాన్ మంత్రి మాతృ వందన, పోషణ అభియాన్ ద్వారా గర్భిణీలు, బాలింతలకు అవసరమైన సాయం అందుతోందన్నారు.

జన్ ధన్ యోజన ద్వారా కోట్లాది మహిళలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి చేరడం సామాజిక మార్పుకు నాంది పలికిందని పేర్కొన్నారు.

🔹 అంకెల్లో కనిపిస్తున్న మార్పు


స్త్రీల నిష్పత్తి, విద్య, ఆరోగ్య రంగాల్లో మహిళల పురోగతి గణనీయంగా పెరిగిందని సౌభాగ్య శ్రీరామ్ తెలిపారు. ప్రభుత్వ చొరవతో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు.

🔹 “లక్షపతి దీదీ” లక్ష్యం

స్వయం సహాయక సంఘాల బలోపేతంతో సుమారు 3 కోట్ల మంది మహిళలను “లక్షపతి దీదీ”లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం విశేషమని తెలిపారు.

చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యం

మహిళలు బహుముఖ ప్రజ్ఞాశాలులని, సమగ్ర దృష్టితో నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం కలిగి ఉన్నారని సౌభాగ్య శ్రీరామ్ అన్నారు. చట్టసభల్లో వారి ప్రాతినిధ్యం పెరిగితే పాలనలో గుణాత్మక మార్పులు తప్పక వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ