సేద్యం దండ,ప్రాజెక్టులపై పెడుతున్న ఖర్చు తడిపి మోపెడు అవుతున్నది,మనం పెడుతున్న ఖర్చుకి, వ్యవసాయం ద్వారా వస్తున్న రాబడికి పొంతన లేదు. ఇదంతా డెడ్ క్యాపిటల్ అని, ప్రపంచ బ్యాంక్ చెప్పినట్లు ఏదీ ఉచితంగా ఇవ్వడానికి వీలులేదు,ప్రతి పనికి యూజర్ ఛార్జీలను వసూలు చేయాలని,ఇది ప్రభుత్వ రంగంలో సాధ్యం కాదని, చివరికి రైతుల వ్యవసాయానికి ఇస్తున్న నీటికి కూడా రెగ్యులేటర్ లు బిగించి చార్జీలు వసూలు చేయాలని చంద్రబాబు ఏనాడో చెప్తాడు. అందుకే ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేసి అన్నీ ప్రైవేటు కు అప్పజెప్పడానికి సిద్ధమైనాడు.
అత్యంత కీలకమైన విద్య, వైద్యం,మెడికల్ కాలేజీలు, ప్రైవేటు రంగ పరిశ్రమలకు రూపాయికే వందల ఎకరాల భూములు కట్టబెట్టినాడు.
నేడు రాష్ట్రంలో గల ప్రాజెక్టులను ఐదు సంవత్సరముల నిర్వహణ కోసం 1637.66 కోట్లు ఖర్చు అవుతుందని,దీనిని ప్రభుత్వం భరించే స్థితిలో లేదని,తక్షణమే ఆంధ్ర ప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ పరిధిలో గల 758 ఎత్తిపోతల పథకాలకు తక్షణం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చంద్రబాబు ప్రకటించి మరొక్క సారి రైతుల మీద పడ్డాడు.
అందుకేనేమో అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు ప్రాణప్రదమైన హంద్రీ-నీవాకు అధికారం చేపట్టిన మరుసటిరోజే 3850 కోట్లు వంద రోజులలో ఖర్చు చేయడం వెనుక అసలు రహస్యం. త్వరితగతిన పూర్తి చేసి తనవారికి అప్పగించ ద్వారా అటు శర వేగంగా చేసిన నాసిరకం పనులలో అవి నీతి,ఇటు ప్రాజెక్టు నిర్వహణ పేరుతో ఐదు సంవత్సరములు నిరాఘాటంగా దోపిడీ,ఇదే బాబు గారి భావజాలం.
ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పగించడం ద్వారా డిస్ట్రిబ్యూటరీలకు రెగ్యులేటర్లను బిగించి నీటిని లీటర్ల ప్రకారం పంట పొలాలకు అమ్మి,రైతుల ముక్కు పిండి వాటర్ సర్వీస్ చార్జెస్ పేరు మీదుగా డబ్బులు దండుకొనే దానిలో భాగమే ఈ ప్రైవేటు భాగ స్వామ్యం.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ రైతులకు అప్ప గించాలి,అవసరమైతే అమరావతి మునిగిపోకుండా ఏర్పాటు చేస్తున్న ఎత్తిపోతల పథకాలను ప్రైవేటుకు అప్పగిస్తే కొట్టుకుపోకుండా కాపాడిన వారవుతారు.లేకుంటే అమరావతిలో ఉన్న పెట్టుబడిదారులందరూ జగన్ సూచించిన *మావిగన్* ప్రాంతానికి వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ప్రాజెక్టులను ప్రైవేటుకు అప్పగించడం అంటే ఇక భవిష్యత్తులో రైతులు ఎవరూ ప్రాజెక్టులు కట్టమని అడగకుండా నోరు మూయించడం,సేద్యానికి సెలవు ప్రకటించడమే.