కిసాన్ అక్షయపాత్ర’కు అధికారుల ప్రశంసలు: సహజ సాగుతో సారవంతమైన భూమి

అనంతపురం: రసాయన రహిత వ్యవసాయ పద్ధతులతో భూమిని సారవంతంగా మార్చుతూ, ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తున్న ‘జై కిసాన్ అక్షయపాత్ర’ క్షేత్రానికి వ్యవసాయ అధికారులు ప్రశంసలు కురిపించారు. ఈ క్షేత్రాన్ని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు (ఏడీఏ) సత్యనారాయణ, వ్యవసాయ అధికారి (ఏవో) భరత్ సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులు స్వయంగా పొలంలోకి వెళ్లి పంట కోతలో పాల్గొనడం విశేషం. ప్రకృతి సిద్ధంగా పండించిన పంటలను పరిశీలిస్తూ, వాటి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు.
రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకపోవడం వల్ల నేలలోని రైజోస్పియర్ మైక్రోబ్స్ విస్తృతంగా పెరిగి, భూమి సారవంతంగా మారిందని ఏడీఏ సత్యనారాయణ వివరించారు. ఈ విధానం వల్ల పంటలకు సహజ రక్షణ లభించి, తెగుళ్లు తగ్గుతాయని తెలిపారు.
అదేవిధంగా, పూర్తిగా విషరహితమైన, ఆరోగ్యకరమైన దిగుబడిని సాధించడం రైతులకు ఆదర్శంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సహజ వ్యవసాయం ద్వారా ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడం కాలానుగుణ అవసరమని పేర్కొన్నారు.
ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తున్న ఫౌండేషన్ చైర్మన్ నాగమల్లి ఓబులేసు కృషిని అధికారులు ప్రశంసిస్తూ, ఇతర రైతులు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని సూచించారు.
సహజ వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యం, రైతు ఆదాయం, వినియోగదారుల ఆరోగ్యం అన్నీ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్శన మరోసారి స్పష్టం చేసింది.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ