ఆర్‌డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ పునరుద్ధరణపై అభినందనలు

అనంతపురం: సేవే లక్ష్యంగా మానవీయ దృక్పథంతో ఎన్నో సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్న RDT సంస్థకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఆర్‌ఏ (FCRA) అనుమతిని పునరుద్ధరించిన సందర్భంగా, ప్రోగ్రామ్ డైరెక్టర్ మంచో ఫెర్రర్ ను స్థానిక జర్నలిస్టులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి కల్చరల్ రిపోర్టర్ రవి కుమార్ ఒక నిరుపేద కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితులను మంచో ఫెర్రర్ దృష్టికి తీసుకెళ్లారు. మానవతా హృదయంతో ఆ కుటుంబానికి తగిన సహాయం అందించి ఆదుకోవాలని జర్నలిస్టులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు రేపటి రామాంజనేయులు, ఉద్దండం చంద్రశేఖర్, అనిల్ కుమార్ రెడ్డి, పులివారి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ