ఉపాధ్యాయురాలిగా మారిన ఎమ్మెల్యే

పుట్లూరు జెడ్పీ హైస్కూల్‌లో తనిఖీ… విద్యార్థులతో మమేకం

పుట్లూరు: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పుట్లూరు జెడ్పీ హైస్కూల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో మమేకమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సదుపాయాలు, బోధన విధానాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను ఎమ్మెల్యే స్వయంగా తనిఖీ చేశారు. ఆహారం మెరుగైన నాణ్యతతో అందించాలని సంబంధిత సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

పాఠశాలలో ఉన్న సమస్యలను కూడా విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఆర్.ఓ ప్లాంట్ మరమ్మతులు, బస్సుల కొరత, ప్రహరీ గోడ లేకపోవడం వంటి సమస్యలను వివరించారు. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
తనిఖీ అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ఉపాధ్యాయురాలిగా మారి తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. దీంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ