ఉరవకొండ: అనారోగ్యంతో అంగన్‌వాడీ కార్యకర్త తిమ్మక్క కన్నుమూత


మండల పరిధిలోని రాయంపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రాయంపల్లి అంగన్‌వాడీ కేంద్రం-1లో కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్న తిమ్మక్క (60)గురువారం అనారోగ్యంతో కన్నుమూశారు.
ఘటన వివరాలు:
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తిమ్మక్క, చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఆమె మృతి పట్ల స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది మరియు గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
*నివాళులర్పించిన అధికారులు:*
తిమ్మక్క భౌతికకాయాన్ని ఉరవకొండ ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవి, సూపర్‌వైజర్ అరుణసందర్శించి నివాళులర్పించారు. అంగన్‌వాడీ కార్యకర్తలు అశ్వర్థమ్మ, జ్యోతి, పద్మ, మంజుల, నాగరత్నమ్మ, అరుణమ్మ మరియు ఆయాలు ఆమెకు నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
*ప్రభుత్వ ఆర్థిక సాయం:*
అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం తరపున మంజూరైన 15,000 రూపాయల** నగదును సీడీపీఓ శ్రీదేవి మృతురాలి కుటుంబ సభ్యులకు అందజేశారు.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ