ఉరవకొండ, ఏప్రిల్ 18
మహిళల పట్ల జరుగుతున్న నేరాల నివారణ మరియు బాల బాలికల భద్రతే ధ్యేయంగా ఉరవకొండ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నేడు ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడుతోంది.
వేదిక:దేవాంగని కల్యాణ మండపం, ఉరవకొండ.
సమయం:ఈరోజు (18.04.2026) ఉదయం 11:30 గంటలకు
ఈ కార్యక్రమంలో మహిళా చట్టాలు, షీ టీమ్స్ సేవలు, మరియు ఆపద సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సమగ్రంగా వివరించడం జరుగుతుంది.
కావున, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ ఈ కార్యక్రమానికి హాజరై, ఈ సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా సామాజిక చైతన్యానికి సహకరించవలసిందిగా
మహానంది
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఉరవకొండ.వారు కోరారు.