ప్రస్తుతం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట ఉండటం వల్ల రైతులు, కౌలు రైతులు తమ పనులను సులభంగా పూర్తి చేసుకుంటున్నారని సంఘం నేతలు తెలిపారు. కార్యాలయాలను మార్కెట్ యార్డుకు తరలిస్తే దూరం పెరిగి రైతులు అనవసర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
అలాగే వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు నిరంతరం సూచనలు, సలహాలు అందించాల్సి ఉంటుందని, కార్యాలయాలు వేరువేరుగా ఉంటే సమన్వయం లోపించి సేవలు ప్రభావితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ కార్యాలయాలను ప్రస్తుత స్థానంలోనే కొనసాగించాలని కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. అధికారులు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
ఈ విన్నపం సమర్పించిన వారిలో ఏపీ కౌలు రైతు సంఘం నాయకులు ఏ. రంగారెడ్డి, బి. వెంకటేష్, వై. సీనప్ప, బి. ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.