:పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థాన భక్తులకు శుభవార్త. స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని ఇకపై దేవస్థాన ఆవరణలోనే అత్యంత నాణ్యతతో, పవిత్రంగా తయారు చేయించాలని ఆలయ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆలయ కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు* కార్యనిర్వాహక అధికారి సాకే రమేష్ బాబు తో కలిసి అధికారిక ప్రకటన విడుదల చేశారు.
వారు మాట్లాడు తూ
స్వచ్ఛతకు ప్రాధాన్యం: భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నెయ్యి మరియు దినుసులతో ప్రసాదాన్ని తయారు చేస్తారని తెలిపారు.
వేదోక్త విధానం: ఈ లడ్డూలను ప్రత్యేకంగా బ్రాహ్మణుల చేత, శాస్త్రోక్తంగా మరియు శుచిగా తయారు చేయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
దేవస్థాన ప్రాంగణంలోనే ఈ తయారీ కేంద్రం ఉండటం వల్ల భక్తులకు తాజాగా, రుచికరమైన ప్రసాదం సులభంగా లభిస్తుంది.
త్వరలో ప్రారంభం: ఈ నూతన సదుపాయం అతి త్వరలోనే భక్తులకు అందుబాటులోకి రానుందని తెలిపారు..