మహిళల రక్షణకు పోలీసులు పెద్ద పీట

 'స్త్రీరక్ష' పోర్టల్, 'శక్తి' యాప్‌పై పోలీసుల అవగాహన
మహిళలు మరియు చిన్నారుల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ఆపద సమయంలో సాంకేతికతను అందిపుచ్చుకుని ఆత్మరక్షణ పొందాలని గుంతకల్లు డీఎస్పీ ఎ.శ్రీనివాస్, అనంతపురం మహిళా డీఎస్పీ ఎస్. మహబూబ్ బాషా పిలుపునిచ్చారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ ఆదేశాల మేరకు శనివారం ఉరవకొండ పట్టణంలోని దేవాంగ కళ్యాణమండపంలో మహిళలు, బాలికల భద్రతపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

*ఇంటి నుండే ఫిర్యాదు – స్త్రీరక్ష పోర్టల్:*
మహిళలు పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా, తమ సమస్యలను ఇంటి నుండే పరిష్కరించుకునేలా జిల్లా ఎస్పీ ప్రవేశపెట్టిన 'స్త్రీరక్ష' పోర్టల్ సేవలను వినియోగించుకోవాలని డీఎస్పీలు సూచించారు. కుటుంబ గౌరవానికి భంగం కలగకుండా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఒక చక్కని వేదిక అని వారు వివరించారు.
 తక్షణ రక్షణకు 'శక్తి' యాప్
వేధింపులు లేదా అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు 'శక్తి' యాప్‌లోని బటన్ నొక్కితే చాలు, పోలీసులు తక్షణమే స్పందించి బాధితులు ఉన్న ప్రాంతానికి చేరుకుని రక్షణ కల్పిస్తారని పోలీసులు తెలిపారు.
 చట్టాలపై అవగాహన
మహిళా రక్షణ చట్టాలు, ఈవ్ టీజింగ్ నిరోధక చర్యల గురించి అధికారులు వివరించారు. ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తించినా, వేధింపులకు గురిచేసినా భయపడకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
అధికారుల భాగస్వామ్యం:
ఈ కార్యక్రమంలో సీఐలు మహనంది, రాజు, వెంకటేశ్వర్లుతో పాటు ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ