జిమ్‌లలో కొత్త ట్రెండ్: వర్కౌట్స్ పేరుతో విన్యాసాల హడావిడి

ఇవన్నీ సినిమాల్లోనో, సీరియల్స్‌లోనో కనిపించే సన్నివేశాలు కావు… నగరాల్లోని జిమ్‌లలోనే జరుగుతున్న తాజా దృశ్యాలు. ఆరోగ్యానికి ప్రాధాన్యం పెరుగుతున్న ఈ కాలంలో జిమ్‌లు యువతతో కిటకిటలాడుతున్నాయి. అయితే ఇటీవలి కాలంలో కొన్ని జిమ్‌లలో “లేటెస్ట్ వర్కౌట్స్” పేరిట జరుగుతున్న విన్యాసాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ప్రత్యేకంగా మహిళలు చేస్తున్న కొన్ని స్టంట్స్ తరహా వర్కౌట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ట్రైనింగ్ కంటే విజువల్ ప్రెజెంటేషన్‌కి ప్రాధాన్యం పెరిగిందని పలువురు భావిస్తున్నారు. ఫిట్‌నెస్ కంటే ఆకర్షణీయమైన వీడియోలు తీసి షేర్ చేయడమే ప్రధాన లక్ష్యంగా మారుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు, గతంలో జిమ్‌లకు వెళ్లని కొంతమంది పురుషులు కూడా ఇప్పుడు ఈ ట్రెండ్ ప్రభావంతో జిమ్‌లకు రావడం పెరిగింది. ఆరోగ్యం కోసం కాకుండా, ఈ విన్యాసాలను ప్రత్యక్షంగా చూడటానికి వస్తున్నారని జిమ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో జిమ్‌లలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కూడా పెరుగుతున్నారు. వర్కౌట్స్ చేస్తున్న వారిని షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కోసం ప్రత్యేకంగా షూటింగ్ జరుగుతోంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ ఫోటోగ్రాఫర్ల నుంచి కూడా జిమ్ నిర్వాహకులు ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ ట్రెండ్‌పై ఫిట్‌నెస్ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గదర్శకత్వం లేకుండా ఇలాంటి విన్యాసాలు చేయడం వల్ల గాయాల ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. జిమ్ అనేది ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే స్థలం కావాలి గానీ, వినోదం లేదా ప్రదర్శన వేదికగా మారకూడదని సూచిస్తున్నారు.

WhatsApp Facebook
హోమ్ ఏపీ తెలంగాణ జాతీయ