ఉరవకొండ
సెప్టెంబర్ 29:
అనంతపురం జిల్లాలోని పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో కొలువైన శ్రీ ఉద్భవ మహాలక్ష్మి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని,ఆదివారం మహా లక్ష్మీ రూపంలో భక్తుల కు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు
సెప్టెంబర్ 22, సోమవారం: ఆదిలక్ష్మి
సెప్టెంబర్ 23, మంగళవారం: గజలక్ష్మి
సెప్టెంబర్ 24, బుధవారం: ధాన్యలక్ష్మి
సెప్టెంబర్ 25, గురువారం: సౌభాగ్యలక్ష్మి
సెప్టెంబర్ 26, శుక్రవారం: ధనలక్ష్మి
సెప్టెంబర్ 27, శనివారం: సంతానలక్ష్మి
* సెప్టెంబర్ 28, ఆదివారం: మహాలక్ష్మి రూపాల్లో దర్శనం ఇచ్చారు.
కాగా సోమవారం
ఉదయం దేవస్థానం లో అమ్మవారు విద్యా లక్ష్మీ గా భక్తులు పూజలు నిర్వహించారు.సుప్రభాత సేవ, పసుపు, కుంకుమార్చనలు చేశారు. పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి భక్తులు పూజలు నిర్వహించారు. చూడముచ్చటగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి.
సోమవారం విద్యాలక్ష్మిగా భక్తుల నీరాజనాల అందుకుంటారని దేవస్థాన పూజారులు ద్వారకనాథ ఆచార్యులు, మయూరం బాలాజీలు తెలిపారు.

Comments
Post a Comment