అరకులోయ: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గిరిజనులు తీవ్ర ఆందోళనకు దిగారు. ఎకో టూరిజం అభివృద్ధి పేరుతో అటవీ శాఖ తమ జీవనోపాధిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందంటూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు గిరిజనులు మెడకు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలపడం ఉద్రిక్తతకు దారితీసింది. మాడగడ మేఘారకొండపై ఆందోళన స్థానిక మాడగడ మేఘారకొండకు వచ్చే పర్యాటకులపై ఆధారపడి సుమారు 600 గిరిజన కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని ఆందోళనకారులు తెలిపారు. అభివృద్ధి, ఎకో టూరిజం పేరుతో అటవీశాఖ ఈ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుని, తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తోందని గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు నినాదాలు చేస్తూ, తమ బతుకులు నాశనం చేయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనులకే అవకాశం కల్పించాలని డిమాండ్ గిరిజన ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో, ముఖ్యంగా పర్యాటక రంగంలో, గిరిజనులకే పూర్తి అవకాశాలు కల్పించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. అటవీ శాఖ ఏకపక్ష నిర్ణయాల వల్ల తమ జీవనోపాధికి ముప్పు వాటిల్లుతోందని, అధికారులు వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. గిరిజ...
Local to international