Skip to main content

Posts

Showing posts with the label Tirupati

తిరుపతిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం

  తిరుపతి:శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయం (SPCH), తిరుపతిలో మరోసారి గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. రాజమహేంద్రవరానికి చెందిన విజయకృష్ణ (28) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, గుంటూరు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన కుటుంబం జీవనాన్ కార్యక్రమం ద్వారా గుండె దానం చేయగా, తిరుపతి ఎస్పీసీహెచ్ లో చికిత్స పొందుతున్న సత్యవేడు ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలుడికి ఆ గుండె అమర్చాలని నిర్ణయించారు. టీటీడీ ఈఓ ఆధ్వర్యంలో ఎయిర్ అంబులెన్స్ ద్వారా గుండెను గుంటూరు నుంచి విజయవాడకు గ్రీన్ ఛానల్ ద్వారా తరలించి, అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి, తరువాత తిరుపతిలోని ఎస్పీసీహెచ్‌కు తీసుకువచ్చారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ సందీప్, డాక్టర్ హర్ష, డాక్టర్ మధు లు సమన్వయంతో శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఆపరేషన్‌తో ఎస్పీసీహెచ్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్సల సంఖ్య 21కి చేరింది.

బీజేపీ గిరిజన మోర్చా జోనల్ సమావేశం: తిరుపతిలో గిరిజన నేతల భేటీ

 తిరుపతి: తిరుపతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గిరిజన మోర్చా రాష్ట్ర నాయకత్వం తిరుపతిలో జోనల్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రాష్ట్రం నలుమూలల నుండి గిరిజన మోర్చా ముఖ్య సభ్యులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పొంగి రాజా రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. గిరిజన మోర్చా కార్యకలాపాలు, పార్టీ పటిష్టత, రాబోయే ఎన్నికల్లో గిరిజన ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడం వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:  * పొంగి రాజా రా  (గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు)  * మూడ్ కేశవ నాయక్  (బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు)  * సుగాలి గోపాల్ నాయక్  (రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్)  * శివా నాయక్   * నారాయణ   * తదితర బీజేపీ గిరిజన మోర్చా కుటుంబ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులు పొంగి రాజా  మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల అభివృద్ధి, హక్కుల పరిరక్షణకు బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను గిరిజనులలోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లడంపై దృష్టి సారించాలని మోర్చా సభ్యు...