స్పందించని పంచాయతీ: జేసీబీతో చెత్త తొలగింపు ఉరవకొండ: అక్టోబర్ 21: ఉరవకొండ పట్టణంలోని ఈశ్వరమ్మ దేవస్థానం పరిసరాలు తీవ్ర దుస్థితికి చేరాయి. ఎక్కడ చూసినా చెత్తాచెదారం, మురుగునీరు, పెరిగిన కంపచెట్లు పేరుకుపోవడంతో ఆలయ పవిత్రతకు భంగం వాటిల్లుతోంది. స్థానికులు పలుమార్లు గ్రామ పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు స్పందించకపోవడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్థానిక నాయకుడుదగ్గుపాటి శ్రీరామ్ స్వయంగా రంగంలోకి దిగారు. దేవస్థానం పరిసరాల శుభ్రత కోసం జేసీబీ (JCB) యంత్రాన్ని ఏర్పాటు చేయించి, పరిసర ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు. చెత్తకుప్పలు, పాడైన రోడ్లు, మూసుకుపోయిన మురుగు కాలువలను ఆయన పర్యవేక్షణలో తొలగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతదగ్గుపాటి శ్రీ రామ్ మాట్లాడుతూ, "ప్రజల ఆరోగ్యం, దేవాలయ పవిత్రత కోసం ఇలాంటి చర్య తప్పనిసరి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, ప్రజాస్వామ్యంలో నాయకులు ప్రజల తరపున ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది" అని వ్యాఖ్యానించారు. పంచాయతీ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "...
Local to international