Skip to main content

Posts

Showing posts with the label Sri Sathya Sai

పని గంటల పెంపును ఉపసంహరించుకోవాలి: హిందూపురంలో ఏఐటీయూసీ నిరసన

  హిందూపురం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పని గంటలను పెంచి వారి హక్కులను కాలరాసే విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురువారం హిందూపురం తాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం జరిగింది. కార్మికులపై అదనపు భారం మోపే నిర్ణయాన్ని తక్షణమే రద్దు చేసి, యథావిధిగా పాత పని గంటలను కొనసాగించాలని ఈ సందర్భంగా ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  కార్మిక హక్కులు కాలరాస్తున్నారు నిరసనకారులను ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు ఆనందరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను విడనాడాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్మికుల హక్కులను కాలరాస్తున్న పాలకుల తీరును వారు తీవ్రంగా ఖండించారు. నల్ల చట్టాలు, ప్రైవేటీకరణపై పోరాటం: పని గంటల పెంపుతో పాటు, ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని, అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ ప్రయత్నాలను తక్షణమే ఆపాలని ఏఐటీయూసీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. ఈ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్న...

⚖️ తీర్పుల ప్రకటనలో నిబంధనల ఉల్లంఘన: జడ్జిపై వేటు!

  CrPC సెక్షన్ 353 నిబంధనల ఉల్లంఘనే కీలకం; న్యాయ వ్యవస్థలో పారదర్శకత ఆవశ్యకతపై చర్చ  ధర్మవరం జడ్జి తొలగింపునకు ప్రధాన కారణం ధర్మవరం సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి బి. కృష్ణవేణి ని ఉద్యోగం నుండి తొలగించడానికి (Removal from Service) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో వెనుక, భారతీయ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) లోని సెక్షన్ 353 నిబంధనలను ఉల్లంఘించడమే ముఖ్య కారణంగా నిలిచింది.  ఏమిటీ CrPC సెక్షన్ 353? CrPC సెక్షన్ 353 అనేది న్యాయస్థానంలో తీర్పును ప్రకటించే (Pronouncement of Judgment) పద్ధతిని వివరిస్తుంది. ఈ సెక్షన్ ప్రకారం, న్యాయమూర్తి:  * తీర్పును తప్పనిసరిగా బహిరంగ న్యాయస్థానంలో ప్రకటించాలి.  * తీర్పును రాసిన తర్వాత లేదా ప్రకటించిన తర్వాత, దానిపై తేదీతో సహా సంతకం (Signature) చేయాలి.  * ముఖ్యంగా, పూర్తి తీర్పు లేకుండా కేవలం 'డాకెట్ ఆర్డర్' తో కేసులను ముగించకూడదు.  రుజువైన ఉల్లంఘనలు: పారదర్శకతకు భంగం జడ్జి శ్రీమతి కృష్ణవేణిపై హైకోర్టు విజిలెన్స్ శాఖ జరిపిన విచారణలో, ఈ సెక్షన్ యొక్క నిబంధనలను అతిక్రమించినట్లు స్పష్టంగా రుజువైంది. రుజువైన ఆరోపణలు:  ...

రాష్టం గర్వించదగ్గ నాయకుడిగా ఎంత ఎదిగి పోయావయ్యా.- మాస్టర్ గంగాధర్ శాస్త్రి

రాష్ట్ర ఆర్థిక మంత్రికి గురువందనం: పయ్యావుల కేశవ్‌కు గురువు ఆశీస్సులు!   పుట్టపర్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురు భక్తిని చాటుకున్నారు. పవిత్ర ఆధ్యాత్మిక పట్టణమైన పుట్టపర్తిలో నివాసముంటున్న తన బాల్య గురువు, రిటైర్డ్ ఉపాధ్యాయులు గంగాధర శాస్త్రి గారిని ఆయన ఆత్మీయంగా కలుసుకున్నారు. శాంతి నిలయంలో గురువు గారితో అనుబంధాన్ని పంచుకున్న మంత్రి కేశవ్, సాష్టాంగ నమస్కారం చేసి, కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. గురువు గారి భావోద్వేగం: "రాష్ట్రం గర్వించదగిన నాయకుడివి" తన శిష్యుడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఎదిగిన తీరును చూసి ఉపాధ్యాయులు గంగాధర శాస్త్రి గారు అమితానందం వ్యక్తం చేశారు. "ఏం నాయనా.. బాగున్నావా... రాష్ట్రం గర్వించదగిన నాయకుడు అయ్యావు సంతోషం" అని అభినందించారు. తన వద్ద విద్యాభ్యాసం నేర్చుకున్న విద్యార్థి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బాగుచేసే ఆర్థికవేత్త అవుతాడని ఊహించలేదని చెబుతూ గంగాధర శాస్త్రి గారు భావోద్వేగానికి లోనయ్యారు. మంత్రి కేశవ్: ఈ రోజు నాకు అమితానందం గురువును కలిసిన సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ కూడా తన బాల్య అనుబంధాన్ని గుర్తు చ...

రానున్న "లోకల్ ఎన్నికల్లో" వడ్డెరలకు ప్రాధాన్యం : మంత్రి సవిత*

 " వడ్డే ఓబన్న" విగ్రహ ప్రతిష్ట "సూపర్... సక్సెస్" గోరంట్ల పట్టణంలో బస్టాండ్ సర్కిల్ లో ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని మంత్రి సవిత స్వహస్తలతో ఆదివారం నాడు వడ్డెరల తో కలసి అంగరంగా వైభవం గా ప్రారంభించారు. ముందుగా మండలంలోని వడ్డెర కులస్తులందరు కలసి హెచ్. పి పెట్రోల్ బాంక్ దగ్గర నుండి కలిశాలతో ఊరేగింపుగా బయలుదేరి బస్టాండ్ దగ్గర వరకు కొనసాగించారు. అనంతరం మంత్రి ఆవిష్కరించారు. మంత్రి సవిత మాట్లాడుతూ పార్టీ, నామినేటెడ్ పదవులతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు రాష్ట్ర బీసీ, సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. వడ్డెర కులస్తులకు గతంలో ఓబన్న విగ్రహం ఏర్పాటు చేయాలని వడ్డెర కులస్తులు కోరారని సొంత నిధులతో విగ్రహాన్ని అంద చేశానని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బీసీలకు టీడీపీతో, రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాధాన్యం లభిస్తోందన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్, నేడు సీఎం చంద్రబాబునాయుడు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారన్నారు. బీసీల మనోభావాలకు గౌరవమిస్తూ, విశ్వకర్మ జయంతి, వాల్మీకి జయంతి, కనకదాస జయంతిని అధ...

శాంతినగర్‌లో నీటి కష్టాలు తీర్చిన టీడీపీ శ్రేణులు: వర్షపు నీరు తొలగింపు

   ధర్మవరం/, అక్టోబర్ 26  గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ధర్మవరం పట్టణంలోని 01వ వార్డు శాంతినగర్‌లో నిలిచిపోయిన నీటి సమస్యను తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు పరిష్కరించారు. టీడీపీ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు ఈ పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.   మట్టి తొలగింపు, దారి ఏర్పాటు వర్షపు నీరు ఇళ్ల ముందు నిలిచిపోయి, రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని స్థానికుల నుంచి అందిన సమాచారం మేరకు టీడీపీ నాయకులు వెంటనే స్పందించారు.  కొంతమంది తమ ఇళ్ల ముందు రా ఎత్తుగా మట్టి తోలించుకోవడం వల్ల నీరు నిలిచిపోతున్నట్లు గుర్తించారు.  తాజాగా నిలిచిపోయిన ఆ మట్టిని పూర్తిగా తొలగించారు.  నిలిచిన నీరంతా పోయే విధంగా దారిని ఏర్పాటు చేయడం జరిగింది.  అంతేకాకుండా, దారికి అడ్డంగా ఉన్న కంపచెట్లను కూడా తొలగించి రోడ్డును శుభ్రం చేయించారు.   కార్యక్రమంలో పాల్గొన్న నేతలు ఈ సేవా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.   తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పరిసే సుధాకర్    క్లస్టర్ ...

మీ సేవా తపన సమాజానికి ఆదర్శం”

  మీ వంటి యువతే దేశం భవిష్యత్తు” ––మంత్రి సత్యకుమార్ యాదవ్ ధర్మవరం,మనజన ప్రగతి అక్టోబర్ 26:— కర్నూలు జిల్లాలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఘోర బస్ ప్రమాదంలో, తక్షణ స్పందనతో పది మందికి పైగా ప్రయాణికులను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన ధర్మవరం యువకులు హరీష్ కుమార్, జ్ఞానేంద్ర, వంశీ ల వీరోచిత చర్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అభినందించారు. ఆదివారం మంత్రి సత్యకుమార్ యాదవ్, ధర్మవరం పట్టణంలోని ఈ యువకుల నివాసాలకు వెళ్లి, వారిని కలుసుకుని వారి ధైర్యసాహసాన్ని ప్రశంసిస్తూ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..., ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న వేళ, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను బయటకు లాగి రక్షించిన ఈ యువకుల చర్య మానవత్వానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. మన సమాజంలో ఇలాంటి ధైర్యవంతులైన యువకులు ఉండటం గర్వకారణం. ప్రాణాలు ప్రమాదంలో ఉన్నప్పటికీ, వారు చూపిన సేవా మనోభావం ప్రతి యువతకు ఆదర్శం. మానవత్వం ముందు భయాన్ని జయించడం, సేవా తపనతో ముందుకు రావడం అనేది నిజమైన వీరోచిత చర్య అని అన్నారు. ప్రజల కోసం నిర్భయంగా మ...

పేదలకు ఆరోగ్య సహాయం – రూ.61.55 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి సత్యకుమార్ యాదవ్

ధర్మవరం, అక్టోబర్ 25:— ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి మరియు ధర్మవరం నియోజకవర్గ శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శనివారం ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో రెండు ముఖ్యమైన సామాజిక సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మొదటగా, ధర్మవరం ప్రాంతానికి చెందిన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న 25 మంది రోగులను సంస్కృతి సేవా సమితి ఆధ్వర్యంలో మోకాళ్ల శస్త్రచికిత్స కోసం బెంగళూరులోని వైదేహి హాస్పిటల్‌కు ప్రత్యేక బస్సు ద్వారా పంపించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రోగులకు శస్త్రచికిత్స ఖర్చులు సహా అన్ని వైద్య సదుపాయాలను సంస్కృతి సేవా సమితి ట్రస్ట్ పూర్తిగా భరిస్తుంది. ప్రజలకు ఉచిత వైద్య సహాయం అందించడంలో సంస్కృతి సేవా సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. సేవ చేయడం ద్వారానే మనిషి జీవితానికి నిజమైన సార్థకత లభిస్తుంది. అవసరంలో ఉన్న వారికి చేయూత అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమం మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు కొత్త ఆశను కలిగిస్తుందని, రోగులు త్వరగా కోలుకుని ఆరోగ్యవంతమైన జీవితం వైపు అడుగులు వేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తరువాత అదే...

స్వతంత్రం తర్వాత పత్యాపురం తండాకు తొలి రహదారి – మంత్రి చేతులమీదుగా ప్రారంభం

స్వతంత్రం తర్వాత పత్యాపురం తండాకు తొలి రహదారి – మంత్రి చేతులమీదుగా ప్రారంభం అభివృద్ధి అనేది హామీ కాదు – ఆచరణలో చేసి చూపిస్తున్నాం – మంత్రి సత్యకుమార్ బత్తలపల్లి, అక్టోబర్ 25:– ధర్మవరం నియోజకవర్గం, బత్తలపల్లి మండలంలోని డి. చెర్లోపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు నిర్మించిన కొత్త బిటి రోడ్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్యా శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ,.... స్వతంత్రం వచ్చినప్పటినుండి రహదారి లేక ఇబ్బందులు పడుతున్న పత్యాపురం గ్రామం మరియు పత్యాపురం తండా ప్రజల అవసరాల నిమిత్తం ఈ బిటి రహదారి నిర్మించి, ప్రజల వినియోగానికి అందించడం నాకు ఆనందంగా ఉంది. ఈ రహదారి మొత్తం పొడవు 1060 మీటర్లు ఉండగా, ₹85.00 లక్షల అంచనా వ్యయంతో పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేయబడింది. పత్యాపురం గ్రామం నుండి పత్యాపురం తండా వరకు ఈ బిటి రహదారి చాలా కాలంగా గ్రామ ప్రజల ఆకాంక్షగా ఉండేది. ఇప్పుడు ఈ రహదారి నిర్మాణం పూర్తికావడంతో తండా ప్రాంత ప్రజలకు రాక...

అండర్ బ్రిడ్జ్ నీటి సమస్యకు నవంబర్‌లో శాశ్వత పరిష్కారం — రైల్వే అధికారులు హామీ

ధర్మవరం, అక్టోబర్ 24:— ధర్మవరం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం సాయంత్రం రైల్వే శాఖ ఆధ్వర్యంలో రైల్వే సంవాద్ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ప్రజలతో పాటు రైల్వే అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, మంత్రి సత్య కుమార్ యాదవ్ తరపున ప్రజల తరఫున పలు ముఖ్యమైన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. హరీష్ బాబు మాట్లాడుతూ — గత కొన్ని సంవత్సరాలుగా గాంధీనగర్, శాంతినగర్, గుట్టకిందపల్లి, ఎల్-3, ఎల్-4 కాలనీల పరిసర ప్రాంతాల్లో అండర్ బ్రిడ్జ్‌లలో వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. అదేవిధంగా ఎల్-3, ఎల్-4 కాలనీలకు బ్రిడ్జ్ యాక్సెస్ నిర్మాణం, స్టేషన్ పరిధిలో కోచ్ మోడల్ రెస్టారెంట్, షాపింగ్ కాంప్లెక్స్, అలాగే 5వ ప్లాట్‌ఫారమ్ వద్ద టికెట్ బుకింగ్ పాయింట్ ఏర్పాటు చేయాలని సూచించారు. హరీష్ బాబు ప్రతిపాదనలకు ప్రతిస్పందిస్తూ, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ మనోజ్, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ (కోఆర్డినే...

గంగమ్మ కృషి దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి ప్రశంస

ఢిల్లీలో ఇటీవల జరిగిన ప్రధాని ధన్ ధాన్య యోజన మరియు సహజ వ్యవసాయ ధ్రువపత్రం కార్యక్రమంలో, శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం రాఘవంపల్లి గ్రామానికి చెందిన సహజ వ్యవసాయ రైతు మహిళ సాకే గంగమ్మ, అన్నమయ్య జిల్లాకు చెందిన సురం శ్రీదేవి తో కలిసి దేశ గర్వకారణమైన ఘనతను సాధించారు. ఈ సందర్భంగా వారు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ని, భారతీయ సహజ వ్యవసాయ సంప్రదాయాన్ని ప్రతిబింబించే సామల చిత్రకళ మరియు ఎద్దుల బండి ప్రతిరూపంతో సన్మానించారు. ఈ సత్కారం భారతదేశ సహజ వ్యవసాయ వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ, సంప్రదాయాన్ని సంరక్షించే క్రమంలో జాతీయ సహజ వ్యవసాయ మిషన్ (NMNF) ఆత్మను ప్రతినిధ్యం వహించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గంగమ్మ ని అభినందిస్తూ – ప్రకృతి ముందుకు నడిపితే రైతులు ఎదుగుతారు, భారత్ అభివృద్ధి చెందుతుంది అని పేర్కొని, సహజ వ్యవసాయం పట్ల తన మద్దతును వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశాల మేరకు, ఆయన నియోజకవర్గ ఇంచార్జ్ హరీష్ బాబు, రాఘవంపల్లి గ్రామానికి వెళ్లి గంగమ్మ ని స్వగృహంలో సన్మానించి, ఆమెను, మంత్రి సత్యకుమార్ యాదవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడించారు. మంత్రి సత్య కుమ...

కనీస మద్దతు ధర లేక మొక్కజొన్న రైతుల దయనీయ స్థితి:

 . -ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్సార్‌సీపీ ఆందోళన   శ్రీ  సత్యసాయి జిల్లా:రాష్ట్రంలో కనీస మద్దతు ధరలు (MSP) లభించక మొక్కజొన్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కూటమి ప్రభుత్వం రైతుల గోడును పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ శ్రీ సత్యసాయి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైయస్సార్‌సీపీ) నేతలు రైతులను పరామర్శించి నిరసన వ్యక్తం చేశారు.  శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం, రోద్దం మండలం, తాడంగిపల్లి గ్రామంలో శనివారం మొక్కజొన్న రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో, వైయస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు, పెనుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి ఉషశ్రీ చరణ్ రైతులను కలిసి మాట్లాడారు. అప్పుల ఊబిలోకి రైతులు: ఉషశ్రీ చరణ్ ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "కనీస మద్దతు ధరలు లభించక, పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, మీ మంత్రులు, యంత్రాంగం కనీసం వారివైపు కన్నెత్తి కూడా చూడకపోవడం ధర్మమేనా?" అని ...