ఉరవకొండ : నాయుడు" అనే బిరుదు చరిత్రలో మొదటగా కమ్మ వర్గానికి, ఆ తర్వాత వెలమ వర్గానికి మాత్రమే వర్తించిందని ఉరవకొండ ట్రూ టైమ్స్ విశ్లేషణలో వెల్లడైంది. ఈ పిలుపు కమ్మవారి రాచరిక గుర్తింపుగా వందల ఏళ్లుగా కొనసాగిందని చరిత్ర ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని పత్రిక పేర్కొంది. కమ్మ రాజుల చరిత్రలో నాయుడు 13వ శతాబ్దంలోనే ముసునూరి కమ్మ రాజులు వారి వంశస్తులు నాయకుడు అనే బిరుదు నుండి "నాయుడు"గా పిలవబడ్డారని చరిత్రకారులు చెబుతున్నారు. వీరి పాలనా ప్రాంతం వరంగల్, భద్రాచలం, రేఖపల్లి వరకు విస్తరించి ఉంది. ఆ తర్వాత సుదీర్ఘ కాలం పాటు పాలించిన ముఖ్యమైన కమ్మ రాజవంశాల పేర్లలో కూడా "నాయుడు" అనే పిలుపు ప్రధానంగా ఉంది. వీరిలో పెమ్మసాని, సాయపనేని, సూర్యదేవర, వాసిరెడ్డి, రావెళ్ళ వంటి కమ్మ రాజులు ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు దాదాపు 200 నుండి 300 ఏళ్లు పరిపాలించారు. కాకతీయ గణపతి దేవుడి బావమరిది పేరు జయప్పనాయుడు. ప్రతాపరుద్రుడి దుర్గ పాలకుడు, మంత్రి పేరు గన్నమనాయుడు. రుద్రమదేవి అంగరక్షకుల పేర్లు కూడా నాయుడు అని శాసనాల్లో కనిపిస్తున్నాయి. నాయుడు అనే బిరుదు కమ్మవారి రాచరికపు పిలుపుగా స్థిరపడక మ...
Local to international