Skip to main content

Posts

Showing posts with the label Guntur

రాళ్లపాడు ఘటనకు అధికార మదమే కారణం – బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్

గుంటూరు జిల్లా రాళ్లపాడు ఘటనపై బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్రయాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతోనే ఈ దాడి జరిగిందని ఆయన మండిపడ్డారు. అధికారపార్టీ నేత వాహనంతో దాడి చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. శనివారం గుంటూరులోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన రామచంద్రయాదవ్, మృతుని కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రాళ్లపాడు లాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని, ప్రభుత్వం చట్టవ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని విమర్శించారు. చంద్రబాబు జీవితం అంతా రెండు నాల్కల ధోరణితోనే సాగిందని ఆయన వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో బిసిలపై అనేక దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆ దాడులను చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారని ఆరోపించారు. బిసి బిడ్డ అమరనాథ్ గౌడ్ హత్య, దళిత డాక్టర్ సుధాకర్ మరణాలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు. చంద్రబాబు పాలనలో బిసిలు, దళితులతో పాటు అధికారంలోకి రావడానికి సహకరించిన వర్గాలపై కూడా దాడులు జరిగాయి. ఆయన నేరాలను అరికట్టకుండా ప్రకటనలకే పరిమితం అవుతున్నారు,” అని రామచంద్రయాదవ్ వ్యాఖ్యా...

గుంటూరు జిల్లా: వేములూరుపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం – కమ్మల రత్న సాగర్ పరిస్థితి విషమం

గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం వేములూరుపాడు గ్రామం సమీపంలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పొనుగుపాడు గ్రామానికి చెందిన కమ్మల రత్న సాగర్ (40) తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉంది. ఆయన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం ప్రకారం, రత్న సాగర్ కుటుంబం పిడుగురాళ్ల నుంచి గుంటూరు వైపు వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారు వేగంగా దూసుకువచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రత కారణంగా రత్న సాగర్ బైక్ నుండి దూరంగా పడిపోగా, ఆయన శరీరానికి తీవ్రమైన గాయాలు తగిలాయి. కాళ్లు, చేతులు, తల భాగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అక్కడికి చేరుకున్న ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ అన్యమత పోస్టర్లు అంటించిన వారితోనే తీయించిన పోలీసులు.

       గుంటూరు : గుంటూరు నగరంలోని పట్టాభిపురంలో ఉన్న స్వామి వివేకానంద విగ్రహం చుట్టూ అన్యమత పోస్టర్లు అతికించడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ పోస్టర్ల విషయం బయటపడగానే భారతీయ జనతా యువమోర్చా నాయకుడు అంకరాజు శశాంక్ శర్మ ఆధ్వర్యంలో బీజేవైఎం, బజరంగ్ దళ్ కార్యకర్తలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.వెంటనే విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, పట్టాభిపురం సిఐ గంగా వెంకటేశ్వరరావు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం, పోస్టర్లు అతికించిన నిర్వాహకులను పిలిపించి వారితోనే పోస్టర్లు తొలగింపజేశారు.ఈ సందర్భంగా ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా ఇరు వర్గాలతో చర్చించి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించినట్లు పోలీసులు తెలిపారు. “పట్టాభిపురంలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద అన్యమత పోస్టర్లు తొలగిస్తున్న దృశ్యం.”