జైపూర్: దరఖాస్తుదారుల్లో ఇంజినీరింగ్,ఎంబిఎ,పిహెచ్‌డి,పిజి అభ్యర్థులు కూడా బిజెపి పాలిత రాజస్థాన్‌లో నిరుద్యోగతాండవ జైపూర్ : దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. చదువుకు తగిన జాబ్ రాకపోవడంతో ఏదో ఒక జాబ్‌లో సెటిలవ్వాలన్న ధోరణిలోకి వచ్చేస్తున్నారు. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్లు వస్తే.. rajasఉద్దరిస్తామంటూ సమస్యల్ని పట్టించుకోవటంలేదనటానికి ఉదాహరణలు ఎన్నో. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలుఉన్నా భర్తీచేయటంలేదు. నిరుద్యోగం ఎంతగా ప్రబలుతున్నదో చెప్పటానికి బిజెపి పాలిత రాజస్థాన్‌లో ఇటీవల ప్యూన్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్‌నే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మొత్తం 53,479 ప్యూన్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా 24.76 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ పోస్టులకు పదో తరగతి అర్హత కాగా.. దరఖాస్తు చేసుకున్నవారిలో డిగ్రీ/బిటెక్, ఎంఎస్‌సి, ఎంబిఎ, లా, పిహెచ్‌డి చేసిన వాళ్లూ పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం. ప్యూన్ పోస్టుల కోసం సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్‌లో నిరుద్యోగ సమస్య ఏ స్థాయిలో ఉందో దీన్నిబట్టి అర్థ...
Local to international