Skip to main content

Posts

Showing posts with the label Kalyandurgam

వీ ఆర్ కు కళ్యాణదుర్గ రూరల్ సీఐ వంశీకృష్ణ

   కళ్యాణదుర్గం రూరల్ సీఐ వంశీకృష్ణను పోలీసు ఉన్నతాధికారులు వీఆర్ కు పంపారు. ఇటీవల సీఐ వంశీ కృష్ణపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. స్టేషన్ కు వచ్చే ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉంటున్నారనే ఫిర్యాదులున్నాయి.  ఈయన తీరుతో స్టేషన్లో పనిచేసే సిబ్బంది సైతం విసుక్కున్నట్లు తెలుస్తోంది. మరీముఖ్యంగా ఓ మహిళ విషయంలో ఈయన వ్యవహారం తీవ్ర వివాదాస్పదమైంది కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్లో వ్యవహారాలపై అనేకమంది ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేశారు.  విధుల్లో నిర్లక్ష్యంపై ఉన్నతాధికారుల విచారణ మేరకు సిఐ వంశీకృష్ణ ను విఆర్ కు పంపారు.

నాగిరెడ్డిపల్లిలో ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం పరిధిలోని నాగిరెడ్డిపల్లి గ్రామం నేడు భక్తి పారవశ్యంలో మునిగింది. గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు మరియు భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కాపు రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వారి సతీమణి, అనంతపురం జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీమతి కాపు భారతి కూడా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాలు: అర్చకులు వేద మంత్రాల మధ్య విగ్రహ ప్రతిష్టాపనను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేక అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రముఖుల సందడి: శ్రీ కాపు రామచంద్రారెడ్డి దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి, తమ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని భక్తులు, నాయకులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఈ మహోత్సవం నాగిరెడ్డిపల్లి గ్రామ ప్రజలకు అత్యంత ఆధ్యాత్మిక అనుభూతిని మిగిల్చి...