Skip to main content

Posts

Showing posts with the label Dharmavaram

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం – హరీష్ బాబు

 ధర్మవరం పట్టణంలోని లోనికోట ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి నియోజకవర్గ ఇన్‌చార్జ్ హరీష్ బాబు స్వయంగా స్పందించారు. బీజేపీ కార్యకర్తలు నందు మరియు మధు లా విన్నపం మేరకు, మంగళవారం హరీష్ బాబు లోనికోట వార్డుకు వెళ్లి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వార్డ్ ప్రజలతో మాట్లాడుతూ, వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. కాల్వలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో మురుగు నీరు నిలిచిపోవడం, దుర్వాసన వ్యాప్తి వంటి సమస్యలను ప్రజలు వివరించారు. వెంటనే హరీష్ బాబు మున్సిపల్ అధికారులను టెలిఫోన్ ద్వారా సంప్రదించి, కాల్వల శుభ్రత పనులను తక్షణమే ప్రారంభించాలనీ, శానిటేషన్ విభాగం పర్యవేక్షణను నిత్యకృత్యంగా నిర్వహించాలనీ కోరారు. అలాగే వీధి దీపాలు పనిచేయకపోవడం పై ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను గమనించి, విద్యుత్ విభాగం సిబ్బందికి దీపాల మరమ్మతు పనులను వేగంగా పూర్తి చేయాలనీ, రోడ్ల మరమ్మత్తు పనులపై వివరణాత్మక ప్రణాళిక రూపొందించాలనీ మున్సిపల్ అధికారులకు సూచించారు. పాడైన రోడ్లను తక్షణమే మరమ్మతు చేసి, అవసరమున్న చోట కొత్త రోడ్లు వేయడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని మున్సిపల్ ఇంజినీర్లకు...