Skip to main content

Posts

Showing posts with the label Tamilnadu

తొక్కిసలాటపై ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు – "ఇది పక్కా ప్రణాళికతో జరిగింది!

కరూర్‌లో టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ ర్యాలీలో జరిగిన దారుణ తొక్కిసలాట ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. ఖుష్బూ మాట్లాడుతూ, “ఈ ఘటన యాదృచ్ఛికం కాదు... పక్కా ప్రణాళికతో కావాలనే సృష్టించినట్లు కనిపిస్తోంది,” అంటూ తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు. తొక్కిసలాటలో జరిగిన నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, దీనికి ఎవరో కావాలనే కారణమై ఉండొచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ ర్యాలీకి రాష్ట్ర ప్రభుత్వం సరైన స్థలం ఇవ్వకపోవడాన్ని ఖుష్బూ తీవ్రంగా విమర్శించారు. “41 మంది ప్రాణాలు పోయాయి... కానీ సీఎం స్టాలిన్ మాత్రం మౌనం వహిస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడాలి. ర్యాలీలో పోలీసులు లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారు?” అని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన అనేక వీడియోలు ఇప్పటికే బయటకు వచ్చాయని, వాటి ఆధారంగా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక కరూర్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఘటనపై పోలీసులు ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ చేపట్టింది.

తొక్కిసలాట ఘటనపై టీవీకే నేత అరెస్టు

  ట్రూ టైమ్స్ ఇండియా తమినాడు: కరూర్ తొక్కిసలాట ఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే పలువురు టీవీకే నేతలపై కేసులు నమోదు చేయగా.. తాజాగా కరూర్ పశ్చిమ జిల్లా కార్య దర్శి మథియాళను అరెస్ట్ చేశారు.                                         తొక్కిసలాట మృత్యుల సంఖ్య 41కు చేరటంతో మథియాళన్ సహా పలువురిపై హత్యాయత్నం, ప్రజా భద్రతకు ముప్పు కలిగించటం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు విజయ్ రాజకీయ బలప్రదర్శన వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు ఎఫ్ఎఆర్లో పేర్కొన్నారు

కరూరులో విషాదం – విజయ్ సభలో తొక్కిసలాట.

 కరూర్ (తమిళనాడు): సినీనటుడు, తమిళగమన పార్టీ (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ప్రచార సభ ఘోర విషాదానికి కారణమైంది. కరూరులో శనివారం రాత్రి జరిగిన ఆయన సభలో తొక్కిసలాట చోటుచేసుకోగా, 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు సహా 38 మంది దుర్మరణం పాలయ్యారు. తమిళనాడు శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్న విజయ్, ఈ నెల 13న రాష్ట్రవ్యాప్త ప్రచారయాత్రను ప్రారంభించారు. ప్రతి శనివారం రెండు జిల్లాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన, నామక్కల్‌లో ఉదయం ప్రచారం ముగించుకుని సాయంత్రం కరూరుకు చేరుకున్నారు. రాత్రి 7.30 గంటల సమయంలో వేలుసామిపురంలో సభ జరుగుతుండగా, విజయ్‌ను దగ్గరగా చూడాలన్న ఉత్సాహంలో అనేక మంది ముందుకు దూసుకెళ్లారు. ఆహుతులు, పిల్లలు, వృద్ధులు, మహిళలు గుంపులో ఇరుక్కుపోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఒకరి తర్వాత ఒకరు స్పృహ తప్పి పడిపోవడంతో గందరగోళం తలెత్తింది. వెంటనే పోలీసు సిబ్బంది, అంబులెన్స్ బృందాలు రంగంలోకి దిగి బాధితులను ఆసుపత్రులకు తరలించారు.రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా 38 మంది మృతి చెందారని ధృవీకరించింది. క్షతగాత్రులు పలువురు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.