విడపనకల్ మండలం పాల్తూరు గ్రామంలో రాష్ట్రీయ పోషణ మాస కార్యక్రమం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సర్పంచ్ బ్యులారాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విడపనకల్లు ఎంపీపీ కరణం పుష్పవతి భీమిరెడ్డి,పిడి నాగమణి,సిడిపిఓ శ్రీదేవి,ఏసిడిపిఓ ఎల్లమ్మ,డిస్టిక్ కోఆర్డినేటర్ రామ్మోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భవతులు,బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేయడంతో పాటు,చిన్నారులకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు నేర్పాలని,బాల్యదశ సంరక్షణకు తల్లిదండ్రులు ఇరువురు తగుచర్యలు తీసుకోని,శిశుపోషణకు బలమైన పునాది వేయాలని పిలుపునిచ్చారు.అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్ తో పాటు ఉప్పు,చక్కెర,నూనె వంటి పదార్థాలను వీలైనంత వరకు తక్కువ మోతాదులో వినియోగించాలని,కాయగూరలు,ఆకుకూరలు వాడకం పెంచాలని అప్పుడే సమతుల్య ఆహారం,సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని తెలిపారు.ఈ సందర్భంగా బాలింతలకు సామూహిక సీమంతాలు,చిన్నారులకు అన్నప్రాస కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు విజయ కుమారి,పుష్పావతి,అంగన్వాడీ టీచర్స్ దుర్గాదేవి,హేమలత,అంగన్వాడి హెల్పర్స్,ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు._
Local to international