కమ్మ సంఘం అధ్యక్షులు దగ్గుపాటి కుటుంబ సభ్యులు ఆదివారం సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీమతి దగ్గుపాటి ధనమని, శ్రీ దగ్గుపాటి ప్రకాష్ నాయుడు, శ్రీ దగ్గుపాటి శ్రీరాములు, మరియు శ్రీమతి దగ్గుపాటి సౌభాగ్య స్వామివారి దివ్య సేవలో పాల్గొని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్నారు. ఆలయం వద్ద చేతులు జోడించి స్వామివారిని దర్శించుకుంటున్న వీరి దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. పండుగ వాతావరణంలో దగ్గుపాటి కుటుంబం దైవారాధనలో మునిగిపోయి, స్వామివారి ఆశీస్సులు పొందింది.
దేవస్థానం అభివృద్ధికి, జింకల పార్కు ఏర్పాటుకు హామీ
ఈ సందర్శన అనంతరం, పెన్హోబిలం పాలకమండలి చైర్మన్ బరిలో ఉన్న దగ్గుపాటి సౌభాగ్యశ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ కీలక హామీలు ఇచ్చారు.
పాలకమండలి చైర్మన్‌గా అవకాశం లభిస్తే, పెన్నాహోబిలం దేవస్థానాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఆయన భక్తులకు భరోసా ఇచ్చారు.
పెన్నహోబిలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని, ఇందులో భాగంగా ప్రత్యేకంగా జింకల పార్కును ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రథ నిర్మాణం తక్షణమే చేపట్టి, భక్తుల కోరికలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తమ అభీష్ట దైవమని పేర్కొంటూ, ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని దగ్గుపాటి వంశీకులు ఈ సందర్భంగా తెలిపారు.



Comments
Post a Comment