శ్రీధర్‌రెడ్డిని చాలాకాలం గుర్తుంచుకొంటారు నెల్లూరు:నగరమనే కాంక్రీట్ అరణ్యానికి ఊపిరితిత్తులు పార్కులే. అగ్గిపెట్టెల వంటి అపార్టుమెంట్లలో నివసించడం తప్పనిసరి అయిన రోజులలో, కాసింత గాలి పీల్చుకొనే వసతి, నాలుగడుగులు నడిచే వనరు పార్కులు మాత్రమే. అందువల్లే ఇళ్లకు లేఅవుట్ చేసిన ప్రతి చోటా 10 శాతం భూమి పార్కు కోసం వదలి పెట్టాలని నియమం. కానీ అదే జరగడం లేదు. ప్లాట్లు అమ్మే వరకు ఖాళీ స్థలం వుంటుంది; ఆ వెంటనే అది కూడా ప్లాట్లుగా మారిపోతుంది. గత ఇరవై ఏళ్లలో నెల్లూరు నగరంలో వేసిన రియల్ ఎస్టేట్ లేఅవుట్లు కనీసం రెండు మూడు వందలుంటాయి. అంటే నగరంలో అన్ని పార్కులు కూడా వుండాలి. కానీ అక్కడొకటి, ఇక్కడొకటి తప్ప, వాటి ఆచూకే లేదు. కారణం - కబ్జా. కొన్ని ప్లాట్లు అమ్మిన వారే స్వంతం చేసుకొంటే, మరికొన్ని స్థానికంగా భుజబలం వున్న వారు కైవసం చేసుకొన్నారు. ఈ దుర్మార్గక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చిత్తశుద్ధితో కూడా ప్రయత్నం చేస్తున్నాడు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 29 పార్కులు గుర్తించి, కబ్జా కోరల నుంచి విముక్తి కల్పించి, చుట్టూ ప్రహరీ గోడ కట్టించాడు...
Local to international