. ఉరవకొండ మండలంలో పెండింగ్‌లో ఉన్న రూ. 33 లక్షలకు పైగా నిధులు 40 రోజులుగా 'వెండర్ ఖాతా'లోనే నిధులు; లబ్ధిదారులకు అందని మొత్తం సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు స్పందించాలని సీపీఎం డిమాండ్ ఉరవకొండ మండలంలో వివిధ పథకాల కింద రైతులకు, ప్రజలకు రావాల్సిన రూ. 33.98 లక్షల రూపాయల బకాయిలను వెంటనే లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయాలని సీపీఎం పార్టీ (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-మార్కిస్టు) మండల నాయకత్వం ఎంపీడీవో (మండల పరిషత్ అభివృద్ధి అధికారి) గారిని కోరింది. నిధులు విడుదలై 40 రోజులు గడిచినా, ఇంకా 'వెండర్ అకౌంట్'లోనే నిలిచిపోవడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా సీపీఎం నాయకులు ఎన్. మధుసూధనన్ నాయుడు కె. సిద్దప్ప కలిసి ఎంపీడీవోకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల వివరాలు ప్రభుత్వం గత 40 రోజుల క్రితమే 'వెండర్ అకౌంట్'లోకి జమ చేసినప్పటికీ, కస్టమర్ల (లబ్ధిదారుల) ఖాతాలకు జమ చేయకుండా పెండింగ్‌లో ఉన్న నిధుల వివరాలను సీపీఎం నాయకులు ఈ విధంగా వివరించారు: ఉద్యాన పంటల బకాయిలు (డీఆర్‌డీఏ ద్వారా): రూ. 66,38,68/- హౌసింగ్ మరియు వాటర్ ...
Local to international