పంజాబ్‌లో రైతులు పంట వ్యర్థాలను తగలబెడుతున్నారు. పంట వ్యర్థాల సమస్య పరిష్కారానికి ప్రభుత్వ సూచనలు, మద్దతు లేకపోవడంతో వాటికి నిప్పు పెట్టడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. దీని వల్ల దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లో కాలుష్యం పెరుగుతోంది. ఓ వైపు పంట వ్యర్థాలకు నిప్పుపెడుతున్న వారిని.. మరో వైపు అదే పంట వ్యర్థాలను ఇంధనంగా మార్చుకుని వ్యాపారం చేస్తున్న వారిని కలిశారు మీడియా ప్రతినిధి సరబ్‌జిత్ ధాలివాల్. పంజాబ్ ఫతేఘర్ జిల్లాలో ఉన్న ఈ పరిశ్రమ పంట వ్యర్థాలను..విద్యుదుత్పత్తికి ఇంధనంలా వినియోగిస్తోంది. ఇది కాలుష్యం సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ పంట వ్యర్థాలను అమ్మడం ద్వారా రైతులు కూడా లాభపడుతున్నారు. ‘పంటవ్యర్థాలు ఓ రకమైన ఇంధనం . చౌకైన ఇంధనం. దీని ప్రాధాన్యత చాలా మందికి తెలీదు.. దీంతో సులభంగా విద్యుదుత్పత్తి చేయచ్చనే విషయం చాలా మందికి తెలియదు. మేం ప్రయత్నించాం... విజయం సాధించాం. ముందుగా ఈ వ్యర్థాలన్నీ బాయిలర్‌లో వేస్తాం. బాయిలర్ నుంచి ఉత్పత్తి అయ్యే నీటిఆవిరి ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నాం. ఈ విద్యుత్తును ఉపయోగించి మేం మా ఫ్యాక్టరీని నడిపిస్తున్నాం’ అని చెప్పారు గణేష్ ఎ...
Local to international